Vaccine for Children: సెప్టెంబర్‌ నాటికి చిన్నారుల టీకా!

తాజా వార్తలు

Published : 19/08/2021 21:34 IST

Vaccine for Children: సెప్టెంబర్‌ నాటికి చిన్నారుల టీకా!

ఆశాభావం వ్యక్తం చేసిన NIV డైరెక్టర్‌

దిల్లీ: దేశంలో సెప్టెంబర్‌ నాటికి చిన్నారులకు కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఐసీఎంఆర్‌- నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ (NIV) డైరెక్టర్‌ డాక్టర్‌ ప్రియా అబ్రహం పేర్కొన్నారు. ప్రస్తుతం 2 నుంచి 18 ఏళ్ల వయసు చిన్నారులపై కొవాగ్జిన్‌ రెండు, మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ కొనసాగుతున్నాయని.. వీటి ప్రయోగ ఫలితాలు త్వరలోనే రానున్నాయని వెల్లడించారు. అనంతరం వాటిని నియంత్రణ సంస్థలకు అందజేసే అవకాశం ఉందని, ఈ ప్రక్రియ పూర్తై సెప్టెంబర్‌ నాటికి పిల్లలకు వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రియా అబ్రహం ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇక చిన్నారుల టీకాపై భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణ ఎల్లా కూడా ఇదే విధమైన అభిప్రాయం వ్యక్తం చేశారు. కొవిడ్‌-19 వ్యాధి నుంచి రక్షణ కోసం చిన్న పిల్లలకు ఇచ్చే ‘కొవాగ్జిన్‌’ టీకా రెండు నెలల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ టీకాను 2 నుంచి 18 ఏళ్ల పిల్లలపై పరీక్షించి చూశామని, ఫలితాలు సంతృప్తికరంగా ఉన్నాయని వెల్లడించారు. ఇప్పటికే టీకా భద్రత ఖరారైందని.. రోగ నిరోధకశక్తి (ఇమ్యునోజెనిసిటీ) ఎలా ఉందనే అంశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు. నెల రోజుల్లో పూర్తి వివరాలు తెలుస్తాయని భారత్‌ బయోటెక్‌ సీఎండీ ఆశాభావం వ్యక్తం చేశారు.

చిన్నారుల కోసం కరోనా వ్యాక్సిన్‌పై భారత్‌ బయోటెక్‌తో పాటు జైడస్‌ క్యాడిలా కూడా క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించింది. వీటిలో 12-18 ఏళ్ల వయసు వారిపై ఇప్పటికే ప్రయోగాలు పూర్తిచేసిన జైడస్‌ క్యాడిలా.. ఆ సమాచారాన్ని కేంద్ర నియంత్రణ సంస్థలకు అందించింది. ఇక చిన్నారుల టీకాలపై ఫలితాలు త్వరలోనే వెల్లడి కానుండడంతో పాటు వ్యాక్సిన్‌ కూడా సెప్టెంబర్‌ నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయని కొవిడ్‌ వర్కింగ్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ ఎన్‌కే అరోరా ఈ మధ్యే పేర్కొన్నారు. ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణదీప్ గులేరియా కూడా సెప్టెంబర్‌లో చిన్నారులకు టీకాలు ఇచ్చే కార్యక్రమం ప్రారంభమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని