Varavara rao: బెయిల్‌ పొడిగించాలని బాంబే కోర్టులో వరవరరావు పిటిషన్‌

తాజా వార్తలు

Updated : 06/09/2021 14:54 IST

Varavara rao: బెయిల్‌ పొడిగించాలని బాంబే కోర్టులో వరవరరావు పిటిషన్‌

ముంబయి: భీమా కోరేగావ్‌ కేసులో నిందితుడిగా ఉన్న వరవరరావు.. తన బెయిల్‌ పొడిగించాలంటూ బాంబే కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. వరవరరావు పిటిషన్‌ను బాంబే కోర్టు విచారణకు స్వీకరించింది. ఆరు నెలల క్రితం వరవరరావుకు షరతులతో కూడిన మధ్యంతర బెయిన్‌ను మంజూరు చేసింది. పిటిషన్‌పై ఈ నెల 24న విచారణ చేపట్టనున్నట్లు బాంబే కోర్టు తెలిపింది.

నక్సల్స్‌తో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో వరవరరావు 2018 నవంబర్‌లో అరెస్ట్‌ అయ్యారు. అదే సంవత్సరం జూన్‌లో సోమ్‌సేన్‌తో సహా మరో అయిదుగురుని ఈ కేసులో పోలీసులు అరెస్ట్‌ చేశారు. పుణె జిల్లాలోని భీమా కోరెగావ్‌లో 2018 జనవరి 1న హింస చెలరేగింది. 200 ఏళ్ల కింద జరిగిన భీమా కోరేగావ్‌ యుద్ధాన్ని స్మరించుకునేందుకు దళితులు చేసిన ప్రయత్నం చివరకి అల్లర్లకు దారితీసింది. ఆ అల్లర్లలో ఒకరు మృతి చెందగా, పోలీసులతో సహా పలువురు గాయపడ్డారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని