Bihar: యువకుడి మర్మాంగం కోసి దారుణ హత్య

తాజా వార్తలు

Published : 26/07/2021 10:12 IST

Bihar: యువకుడి మర్మాంగం కోసి దారుణ హత్య

ప్రియురాలి కుటుంబసభ్యుల ఘాతుకం

 

ముజఫర్‌నగర్‌: ప్రేమ వ్యవహారంలో ఓ యువతి కుటుంబసభ్యులు దారుణానికి పాల్పడ్డారు. తమ కుమార్తెను ప్రేమించిన వ్యక్తి మర్మాంగాన్ని కోసి అతి కిరాతకంగా హత్య చేశారు. ఆగ్రహానికి గురైన మృతుడి కుటుంబ సభ్యులు.. అతడి మృతదేహానికి నిందితుల ఇంటి ముందే అంత్యక్రియలు చేశారు. బిహార్‌లోని ముజఫర్‌పుర్‌ జిల్లా కంటి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. రేపురా రామ్‌పుర్షా గ్రామానికి చెందిన సౌరభ్‌రాజ్‌.. సోర్బారా గ్రామానికి చెందిన యువతిని ప్రేమించాడు. వీరి ప్రేమను యువతి కుటుంబ సభ్యులు వ్యతిరేకించారు. శుక్రవారం రాత్రి  సౌరభ్‌ను  తమ ఇంటికి పిలిపించారు. అతడిపై దాడి చేసి మర్మాంగం కోసి చిత్రహింసలకు గురి చేశారు. అనంతరం ఓ ఆస్పత్రిలో చేర్చి పరారయ్యారు. అక్కడే అతడు ప్రాణాలు కోల్పోయాడు.

సౌరభ్‌ మృతితో అతడి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఈ ఘటనతో అతడి కుటుంబసభ్యులు ఆగ్రహానికి గురయ్యారు. పోస్టు మార్టం నిర్వహించిన అనంతరం.. మృతదేహాన్ని నిందితుల ఇంటి ముందుకు తీసుకువచ్చి ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. మృతదేహానికి ఆ ఇంటివద్దే అంత్యక్రియలు చేశారు. నిందితుడి నివాసంపై దాడి చేశారు. సౌరభ్‌ హత్య కేసులో కీలక నిందితుడిగా భావిస్తున్న సుశాంత్‌ పాండే అనే యువకుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్టుచేశారు. నిందితుడి ఇంటిపై దాడికి పాల్పడిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని