Coronavirus: 75శాతం కేసులు ఆ పది రాష్ట్రాల్లోనే!
close

తాజా వార్తలు

Published : 17/05/2021 16:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Coronavirus: 75శాతం కేసులు ఆ పది రాష్ట్రాల్లోనే!

న్యూదిల్లీ: దేశంలో కరోనా విజృంభణ నెమ్మదిగా తగ్గుతోంది. గత ఐదు రోజులుగా నమోదవుతున్న కేసులు, రికవరీ అవుతున్న వారి గణాంకాలే ఇందుకు నిదర్శనం. గత 24 గంటల్లో నమోదైన కరోనా కేసుల కంటే అధికంగా 1.01లక్షల మంది కరోనా నుంచి కోలుకోవడం ద్వారా యాక్టివ్‌ కేసుల సంఖ్య 35,16,997కు తగ్గిందని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. ఇక 75.04శాతం కేసులు పది రాష్ట్రాల్లోనే నమోదవుతున్నట్లు తెలిపింది.

కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, రాజస్థాన్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌, గుజరాత్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో అత్యధికంగా వస్తున్నాయి. కొత్తగా 2.81లక్షల మంది కరోనా బారిన పడగా, మే 9 తర్వాత ఇంత తక్కువ కేసులు నమోదవడం ఇదే. పాజిటివిటీ రేటు 18.17శాతానికి తగ్గడం గమనార్హం. ఇక మరణాల రేటు కూడా 1.10శాతంగా ఉన్నట్లు ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. మహారాష్ట్రలో అత్యధికంగా 34,389 మంది కరోనా బారిన పడగా, ఆ తర్వాత తమిళనాడులో 33,181 కేసులు నమోదయ్యాయి. కర్ణాటకలోని అత్యధిక జిల్లాల్లో పాజిటివిటీ రేటు 20శాతంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

గత 24 గంటల్లో కరోనాతో బాధపడుతూ 4,106మంది మృత్యువాత పడ్డారు. అత్యధికంగా మహారాష్ట్రలో 974మంది మృతి చెందగా, కర్ణాటకలో 403మంది చనిపోయారు. ఇప్పటి వరకూ 18.30కోట్ల వ్యాక్సిన్‌ డోస్‌లను కేంద్ర ప్రభుత్వం అందించింది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 7లక్షలమంది వ్యాక్సిన్‌ తీసుకున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని