close

తాజా వార్తలు

Updated : 20/01/2021 15:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పదో  రౌండ్‌ చర్చలు.. పరిష్కారం దొరుకుతుందా? 

రైతులతో కేంద్రం చర్చలు ప్రారంభం

దిల్లీ:  కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలపై కేంద్ర మంత్రుల బృందం- రైతు సంఘాల నేతల మధ్య పదో విడత చర్చలు ప్రారంభమయ్యాయి. విజ్ఞాన్‌ భవన్‌లో కేంద్రమంత్రులు నరేంద్రసింగ్‌ తోమర్‌, పీయూష్‌ గోయల్‌, ఓంప్రకాశ్‌ రైతు సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. కొత్తగా సాగు చట్టాల్ని రద్దుచేయాలని డిమాండ్‌ చేస్తున్న రైతులు దిల్లీ సరిహద్దుల్లో గత 50రోజులకు పైగా పోరాటం కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. అయితే, సవరణలకు సిద్ధమంటోన్న ప్రభుత్వం ఆ చట్టాల్ని వెనక్కి తీసుకొనే ప్రసక్తే లేదని తేల్చి చెబుతుండటంతో ఈ వ్యవహారంపై ప్రతిష్టంభన కొనసా..గుతూనే ఉంది. ఇరు వర్గాలు తమ వాదనల నుంచి వెనక్కు తగ్గకపోవడంతో తొమ్మిది విడతలుగా చర్చలు జరిగినా ఎలాంటి పరిష్కారం లభించలేదు. ఈ నెల 15న జరిగిన తొమ్మిదో రౌండ్‌ చర్చల్లో.. మూడు వ్యవసాయ చట్టాల్లో ఏయే అభ్యంతరాలు ఉన్నాయో జాబితాతో వస్తే వాటిపై చర్చించి సమస్య పరిష్కరించుకుందామని కేంద్రమంత్రి తోమర్‌ రైతుల ముందు ప్రతిపాదన పెట్టారు. అయితే, మొత్తం చట్టమే అభ్యంతరకరంగా ఉన్నప్పుడు అంశాలవారీగా చర్చించడం ద్వారా ప్రయోజనం ఉండదని రైతు నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రారంభమైన చర్చల్లోనైనా ఈ ప్రతిష్టంభనకు తెరపడుతుందో, లేదో అనే ఉత్కంఠ నెలకొంది. 

వ్యవసాయ చట్టాల రద్దు, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని రైతు సంఘాల నేతలు పట్టుబడుతున్నా కేంద్రం అందుకు ససేమిరా అంటోంది. సాగు చట్టాలను ఉపసంహరించుకొనే ప్రసక్తే లేదని తేల్చి చెబుతోంది. ఈ నేపథ్యంలో కొత్త సాగు చట్టాల విషయంలో రైతు సంఘాలు, కేంద్ర ప్రభుత్వం మధ్య ఏర్పడిన ప్రతిష్టంభనను తొలగించేందుకు సుప్రీంకోర్టు నలుగురు సభ్యుల కమిటీని నియమించడం, దాని నుంచి భూపీందర్‌సింగ్‌ మాన్‌ వైదొలగిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ఈ చట్టాలు రద్దు తప్ప మరో అంశంపై చర్చించేది లేదని అన్నదాతలు తేల్చి చెబుతున్నారు. రైతులకు మద్దతు ఇచ్చేవారిపై కేసులు పెట్టడాన్ని నిరసిస్తున్నారు. హరియాణాలో రైతులపై 900 కేసులు నమోదు పైనా మండిపడుతున్నారు. చట్టాల రద్దుపై కమిటీ వేయాలని తామేమీ సుప్రీంకోర్టును కోరలేదంటున్న రైతులు.. ఆ కమిటీ ముందుకు వెళ్లబోమంటున్నారు. విధాన నిర్ణయం తీసుకోవాల్సింది ప్రభుత్వమేని, అందువల్ల తామే కేంద్రంతోనే చర్చలు జరుపుతామని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి..
కమిటీ సభ్యులను కించపరుస్తారా?



Tags :

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని