కరోనా నుంచి కోలుకున్నా.. మరణ ధ్రువపత్రం జారీ!

తాజా వార్తలు

Published : 02/07/2021 22:14 IST

కరోనా నుంచి కోలుకున్నా.. మరణ ధ్రువపత్రం జారీ!

థానె టీచర్‌కు వింత అనుభవం

ముంబయి: కరోనా నుంచి కోలుకున్న వ్యక్తిని చనిపోయాడంటూ కరోనా మృతుల జాబితాలో చేర్చారు. మరణ ధ్రువపత్రం సిద్ధం చేసి ఏకంగా అతడికే ఫోన్‌ చేసి తీసుకెళ్లమన్నారు. ఈ ఘటన మహారాష్ట్రలోని థానెలో చోటు చేసుకుంది.

థానెకి చెందిన 55 ఏళ్ల చంద్రశేఖర్‌ దేశాయ్‌ ఘట్కోపర్‌ ప్రాంతంలోని ఓ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. గతేడాదే ఆయన కరోనా సోకి ఆస్పత్రి చేరారు. కొన్ని రోజులకే పూర్తిగా కోలుకొని తిరిగి ఇంటికి చేరుకున్నారు. అయితే, ఇటీవల థానె మున్సిపాలిటీ అధికారులు చంద్రశేఖర్‌ పేరును కూడా కరోనా కారణంగా మృతి చెందిన వారి జాబితాలో చేర్చి.. మరణ ధ్రువపత్రం సిద్ధంచేశారు. అంతేకాదు, అతడికి ఫోన్‌ చేసి మరణ ధ్రువపత్రం తీసుకెళ్లమని చెప్పడంతో చంద్రశేఖర్‌ అవాక్కయ్యారు. తాను బతికే ఉన్నానని చెప్పడంతో థానె మున్సిపల్‌ అధికారులు జరిగిన తప్పును గుర్తించారు. ఆ జాబితా పుణెలో రూపొందిందని, చంద్రశేఖర్‌ పేరును పొరపాటున కరోనా మృతుల జాబితాలో చేర్చారని వివరణ ఇచ్చారు. ఇది గమనించకుండా ఫోన్‌ చేశామని తెలిపారు. ఇకపై వ్యక్తుల వివరాలు క్షుణ్ణంగా పరిశీలించకుండా ఫోన్లు చేయబోమని మున్సిపల్‌ అధికారులు చెప్పారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని