యువర్‌ ఆనర్‌ అనొద్దు
close

తాజా వార్తలు

Published : 24/02/2021 09:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

యువర్‌ ఆనర్‌ అనొద్దు

ఇది అమెరికా న్యాయస్థానం కాదు

దిల్లీ: న్యాయమూర్తులను ‘యువర్‌ ఆనర్‌’ అని సంబోధించవద్దని, ఇది అమెరికా న్యాయస్థానం కాదని సుప్రీంకోర్టు మంగళవారం న్యాయ విద్యార్థి ఒకరిని హెచ్చరించింది. ‘‘మమ్మల్ని యువర్‌ ఆనర్‌ అని నీవు సంబోధిస్తున్నావంటే.. నీ మనసులో అమెరికా సుప్రీంకోర్టు ఉన్నట్లు అనిపిస్తోంది’’ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే, జస్టిస్‌ ఏఎస్‌ బోపన్న, జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. దీంతో ఆ విద్యార్థి వెంటనే న్యాయస్థానానికి క్షమాపణలు చెప్పారు.

 ‘యువర్‌ లార్డ్‌షిప్‌’ అని సంబోధిస్తానని తెలిపాడు. దీనిపై స్పందించిన ప్రధాన న్యాయమూర్తి ‘ఏమైనా కానీ, అసందర్భ పదాలను వాడొద్దు’’ అని అన్నారు.  అనంతరం కేసు ఏమిటని విద్యార్థిని ప్రశ్నించారు. న్యాయవ్యవస్థలో నేర న్యాయ విభాగాన్ని బలోపేతం చేయాలంటూ దాఖలుచేసిన అభ్యర్థనపై వ్యక్తిగతంగా హాజరయ్యానంటూ విద్యార్థి పేర్కొన్నారు. ఈ వ్యవహారానికి సంబంధించిన కేసు ఇప్పటికే పెండింగ్‌లో ఉందని, సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేయడం కూడా జరిగిందని ధర్మాసనం పేర్కొంది. అనంతరం విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. అప్పటికల్లా పూర్తిస్థాయిలో సిద్ధమవ్వాలని ఆదేశించింది. 
 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని