Michael k Williams: ‘ది వైర్‌’ నటుడు మైఖేల్‌ కె విలియమ్స్‌ మృతి

తాజా వార్తలు

Updated : 07/09/2021 04:27 IST

Michael k Williams: ‘ది వైర్‌’ నటుడు మైఖేల్‌ కె విలియమ్స్‌ మృతి

న్యూయార్క్‌: అమెరికా ప్రముఖ టెలివిజన్‌ షో ‘ది వైర్‌’ సిరీస్‌ నటుడు మైఖేల్‌ కె విలియమ్స్‌(54) న్యూయార్క్‌ సిటీలో చనిపోయారు. తన అపార్ట్‌మెంట్‌లో అమెరికా కాలమానం ప్రకారం మధ్యాహ్నం రెండు గంటలకు చనిపోయి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. విలియమ్స్‌ ఎలా మృతి చెందారన్నదానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మాదక ద్రవ్యాలు అధికంగా తీసుకోవడంతోనే ఆయన మృతిచెందినట్లు పోలీసులు భావిస్తున్నారు. 2002 నుంచి 2008 మధ్య అమెరికా కేబుల్‌ నెట్‌వర్క్‌ అయిన హెచ్‌బీఓలో ‘ది వైర్‌’ టెలివిజన్ సిరీస్‌ ప్రసారమైంది. డ్రగ్‌ డీలర్‌ పాత్రలో ఓమర్‌ లిటిల్‌గా ఆయన ఒక్కసారిగా వేల మంది అభిమానులను సంపాదించుకున్నారు. ‘లవ్‌క్రాఫ్ట్ కంట్రీ’ సిరీస్‌లో విలియమ్స్‌ ఉత్తమ నటనతో 2021 ఎమ్మీ అవార్డుకు నామినేట్‌ అయ్యారు. ‘బోర్డ్‌వాక్‌ ఎంపైర్‌’ సిరీస్‌లోనూ ఆయన నటనకు మంచి పేరు వచ్చింది. 
 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని