ఒక్కరోజులోనే 10 అంతస్తుల భవనం!
close

తాజా వార్తలు

Published : 19/06/2021 20:21 IST

ఒక్కరోజులోనే 10 అంతస్తుల భవనం!

ఇంటర్నెట్‌డెస్క్: ఆకాశ హర్మ్యాలు, బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు ఇటీవల సర్వసాధారణమైపోయాయి. పైకెత్తి చూస్తే తలపాగా పడిపోయేంత ఎత్తయిన కట్టడాలెన్నో చూస్తున్నాం. అయితే వీటిని నిర్మించేందుకు కనీసం నెలల సమయమైనా పట్టొచ్చు. కానీ, చైనాకు చెందిన బోర్డు గ్రూపు నిర్మాణ సంస్థ మాత్రం 10 అంతస్తుల భారీ భవనాన్ని కేవలం 28 గంటల 45 నిమిషాల్లో నిర్మించి ఔరా అనిపించింది. అదెలా సాధ్యం అనుకుంటున్నారా? అదే ‘ప్రీ ఫ్యాబ్రికేటెడ్ కన్‌స్ట్రక్షన్‌’ విధానం ప్రత్యేకత.

ఈ విధానం ఇప్పటికే అందుబాటులో ఉన్నప్పటికీ మరీ ఇంత తక్కువ సమయంలో అంత ఎత్తయిన భవనాన్ని నిర్మించడం ఇదే తొలిసారి అని బోర్డు గ్రూపు సంస్థ చెబుతోంది. ఇంతకీ ఈ ప్రీ ఫ్యాబ్రికేటెడ్‌ కన్‌స్ట్రక్షన్‌ విధానంలో ఏం చేస్తారంటే.. మొత్తం భవనాన్ని చిన్న చిన్న యూనిట్లుగా విభజిస్తారు. ఆ యూనిట్ల నిర్మాణాన్ని విడివిడిగా పూర్తి చేసిన తర్వాత వాటిని ఒకదానిపై ఒకటి పేర్చి పెద్ద భవనంగా రూపొందిస్తారు. విద్యుత్‌, నీటి సదుపాయాలను వేటికవే పూర్తి చేస్తారు. చివర్లో అనుసంధానిస్తారు. అయితే ఇది కూడా అంత సులభమేం కాదు. భారీ స్థాయి పరికరాలు అవసరమవుతాయి. చాలా జాగ్రత్తగా అమర్చాల్సి ఉంటుంది. లేదంటే భవనం ఒక్కసారిగా కూలిపోయే ప్రమాదం కూడా ఉంది. ప్రస్తుతం భవనానికి సంబంధించి మొత్తం నిర్మాణ తీరును వివరిస్తూ 4.52 నిమిషాల నిడివి గల వీడియోను ఆ సంస్థ యూట్యూబ్‌లో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని