45 ఏళ్లు పైబడిన వారందరికీ టీకా

తాజా వార్తలు

Updated : 23/03/2021 16:26 IST

45 ఏళ్లు పైబడిన వారందరికీ టీకా

ఏప్రిల్ ఒకటి నుంచి పంపిణీ

దిల్లీ: కరోనా మహమ్మారి ఉద్ధృతి నేపథ్యంలో..టీకా కార్యక్రమం కింద కేంద్రం మరో ప్రాధాన్య సమూహాన్ని చేర్చింది. 45 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసు వారికి ఏప్రిల్‌ ఒకటి నుంచి టీకాలు అందించనున్నట్లు మంగళవారం వెల్లడించింది. ఇప్పటికే ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కరోనా టీకా కార్యక్రమం కింద మొదటి దశలో పారిశుద్ధ్య కార్మికులు, వైద్య సిబ్బందికి టీకాలు పంపిణీ చేస్తోంది. రెండో దశలో 60 ఏళ్లు దాటిన, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతోన్న 45 నుంచి 59 సంవత్సరాల వారికి టీకాలు ఇస్తున్నారు. రెండో దశలో కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తోన్న తరుణంలో..యువత, 45 ఏళ్లు పైబడిన వారిని కూడా టీకా కార్యక్రమం కిందికి తీసుకురావాలని పలు రాష్ట్రాలు కేంద్రాన్ని అభ్యర్థించాయి. ఈ క్రమంలోనే కేంద్రం నుంచి తాజా ప్రకటన వెలువడింది. 

‘45 లేక అంతకంటే ఎక్కువ వయస్సున్న ప్రతి ఒక్కరు టీకా వేయించుకునే నిమిత్తం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని కోరుతున్నాను. కరోనా వైరస్ టాస్క్‌ ఫోర్స్, నిపుణులు ఇచ్చిన సూచనలను అనుసరించి కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది’ అని కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్ వెల్లడించారు. మరోవైపు, ప్రస్తుతం నడుస్తోన్న టీకా కార్యక్రమం కింద మార్చి 22 నాటికి కేంద్రం 4,84,94,594 టీకా డోసులను పంపిణీ చేసింది. నిన్న ఒక్కరోజే 32,53,095 మందికి టీకాలు అందించింది. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని