
తాజా వార్తలు
ముంబయికి వేల మంది రైతుల కవాతు
ముంబయి: కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ దిల్లీలో రైతులు నిర్వహిస్తున్న ఆందోళనకు మద్దతుగా మహారాష్ట్ర రైతులు భారీ కవాతు నిర్వహించారు. నాసిక్ నుంచి రాష్ట్ర రాజధాని ముంబయికి పయనమయ్యారు. ఆల్ ఇండియా కిసాన్ మహాసభ నేతృత్వంలో వేల మంది రైతులు ఈ కవాతులో పాల్గొన్నారు. మరికొద్ది గంటల్లో ముంబయి చేరుకోనున్నారు. ముంబయిలోని ఆజాద్ మైదానంలో సోమవారం భారీ సభ నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమానికి ఎన్సీపీ అధినేత శరద్ పవార్ హాజరుకానున్నారు. ఆయతనో పాటు శివసేనకు చెందిన ఆదిత్య ఠాక్రే, బాల సాహెబ్ థరోఠ్తో పాటు కాంగ్రెస్, ఎన్సీపీ, వామపక్షాలకు చెందిన పలువురు నేతలు పాల్గొననున్నారు. దేశ రాజధానిలో ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించనున్న రెండు రోజుల ముందు ఈ భారీ ర్యాలీ నిర్వహించడం గమనార్హం. అంతకుముందు మహారాష్ట్రలోని 21 జిల్లాలకు చెందిన రైతులంతా శనివారం నాసిక్‌లో సమావేశమయ్యారు.
ఇవీ చదవండి..
దిల్లీలో ట్రాక్టర్ ర్యాలీకి రైతుల సన్నాహాలు
6 రోజుల్లో 10లక్షల మందికి టీకా!