ఎయిర్‌పోర్టు కట్టబోతే.. సమాధులు బయటపడ్డాయి!

తాజా వార్తలు

Updated : 19/02/2021 04:36 IST

ఎయిర్‌పోర్టు కట్టబోతే.. సమాధులు బయటపడ్డాయి!

ఇంటర్నెట్‌ డెస్క్‌: చైనా ప్రాచీన చరిత్ర గల దేశం. అందుకే ఎప్పుడూ ఏదో ఒక చోట పురాతన ఆనవాళ్లు బయటపడుతూనే ఉంటాయి. తాజాగా షాన్సీ ప్రావిన్స్‌లో ఎయిర్‌పోర్టును విస్తరించేందుకు నిర్మాణ పనులు చేపట్టగా వేలకొద్ది సమాధులు బయటపడ్డాయి. దీంతో నిర్మాణ ప్రాంతం కాస్త.. పురావస్తు ప్రదర్శన శాలగా మారిపోయింది. వివరాల్లోకి వెళ్తే..

షాన్సీ ప్రావిన్స్‌ రాజధాని గ్జియాన్‌లో గ్జియాన్‌యాంగ్‌ ఎయిర్‌పోర్టు ఉంది. ఇటీవల ఈ ఎయిర్‌పోర్టు విస్తరణ పనులను ప్రారంభించారు. నిర్మాణంలో భాగంగా భూమిని తొవ్వుతుండగా.. సమాధులు బయటపడటం అందరిని ఆశ్చర్యపర్చింది. దీంతో నిర్మాణ కార్మికులను పక్కన పెట్టి.. పురావస్తుశాఖ అధికారులు, సిబ్బంది రంగంలోకి దిగారు. చైనా నూతన సంవత్సర వేడుకల కోసం పెట్టిన సెలవులు సైతం వదులుకొని ఎయిర్‌పోర్టు ప్రాంతంలో తవ్వకాల్లో పాల్గొన్నారు. ఇప్పటివరకు 4,600 పురాతన వస్తువులను వెలికితీయగా.. వాటిలో 3,500 సమాధులు ఉన్నట్లు వెల్లడించారు. ఈ సమాధులు చరిత్రలో వేర్వేరు కాలాల్లో.. వేర్వేరు రాజ్యాలకు సంబంధించిన వారివిగా పురావస్తుశాఖ నిపుణులు గుర్తించారు.

గ్జియాన్ ప్రాంతం ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైన నాలుగు రాజధానుల్లో ఒకటని చైనా స్టేట్‌ కౌన్సిల్‌ వెల్లడించింది. రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక అంశాలకు 1,100 ఏళ్లపాటు గ్జియాన్‌ రాజధానిగా ఉందని నిపుణులు పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని