Task Forceలో సుందర్‌ పిచాయ్‌, పునీత్‌ రంజన్‌
close

తాజా వార్తలు

Published : 08/05/2021 01:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Task Forceలో సుందర్‌ పిచాయ్‌, పునీత్‌ రంజన్‌

వాషింగ్టన్‌: కరోనాపై పోరులో భారత్‌కు సహకరించేందుకు ఏర్పాటైన గ్లోబల్‌ టాస్క్‌ఫోర్స్‌లో ముగ్గురు దిగ్గజ సంస్థల సీఈఓలు చేరారు. గూగుల్ సీఈఓ సుందర్‌ పిచాయ్‌, డెలాయిట్‌ సీఈఓ పునీత్‌ రంజన్‌, అడోబ్‌ సీఈఓ శంతను నారాయణ్‌ దీనిలో భాగస్వాములయ్యారు. ఇప్పటికే వీరంతా భారత్‌లో పలు సహాయక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బిల్‌ అండ్‌ మిలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ సీఈఓ మార్క్‌ సుజ్‌మన్‌, బిజినెస్‌ రౌండ్‌ టేబుల్‌ సీఈఓ జోషువా బోల్టెన్‌, యూఎస్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ సీఈఓ సుజెన్‌ క్లాస్‌ సైతం టాస్క్‌ఫోర్స్‌లో భాగస్వాములయ్యారు.

అమెరికా ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఆధ్వర్యంలో ఈ టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటైంది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం ఆధారంగా దీనిని నూతనంగా ఏర్పాటుచేశారు. ‘బిజినెస్‌ రౌండ్‌ టేబుల్‌’ అనే స్వచ్ఛంద సంస్థ దీనికి సహకారం అందిస్తోంది. యూఎస్‌ ఇండియా బిజినెస్‌ కౌన్సిల్‌.. యూఎస్‌ ఇండియా స్ట్రాటెజిక్‌ పార్ట్‌నర్‌షిప్‌ ఫోరంతో కలిసి ఈ టాస్క్‌ఫోర్స్‌ పనిచేస్తోంది. భారత్‌లో కరోనా వ్యాప్తిని నియంత్రించే విధంగా సత్వర చర్యలు చేపట్టడం ఈ టాస్క్‌ఫోర్స్‌ ముఖ్య లక్ష్యం. భారత్‌కు 25 వేల ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు, 1000 వెంటిలేటర్లు అందించాలని అమెరికా కార్పొరేట్‌ సంస్థలు నిర్ణయించాయి. కాగా ఇందులో డెలాయిట్‌ పంపిన 1000 ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు ఏప్రిల్‌ 25న భారత్‌కు చేరాయి.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని