‘పోలీసులు నాకు సెల్యూట్‌ చేయట్లేదు.. చర్యలు తీసుకోండి’

తాజా వార్తలు

Updated : 04/07/2021 22:28 IST

‘పోలీసులు నాకు సెల్యూట్‌ చేయట్లేదు.. చర్యలు తీసుకోండి’

కేరళ డీజీపీకి త్రిస్సూర్‌ మేయర్‌ ఫిర్యాదు

తిరువనంతపురం: పోలీసులు తనకు సెల్యూట్‌ చేయట్లేదని, వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ కేరళ డీజీపీ అనిల్‌ కాంత్‌కు త్రిస్సూర్‌ నగర మేయర్‌ ఎంకే వర్గీస్ ఫిర్యాదు చేశారు. ఈ ఘటన మూడు రోజుల కిందట జరిగింది. కాగా.. మేయర్‌ ఫిర్యాదుపై పోలీసులు ఘాటుగా స్పందించడం గమనార్హం.

ఇటీవల మేయర్‌ ఎంకే వర్గీస్‌ ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు తన కారులో వెళ్తుండగా.. పోలీసులు సెల్యూట్‌ చేయకుండా వెళ్లిపోయారట. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన మేయర్‌ డీజీపీకి ఫిర్యాదు చేశారు. ‘‘సెల్యూట్‌ నాకు కాదు.. నేను చేపట్టిన పదవికి చేయాలి. కార్పొరేషన్‌ పరిధిలో ప్రోటోకాల్‌ ప్రకారం గవర్నర్‌, ముఖ్యమంత్రి తర్వాత మేయర్‌కే స్థానం ఉంటుంది. ఎమ్మెల్యేలకు, ఎంపీలకు పోలీసు ఉన్నతాధికారులకు పోలీసులు సెల్యూట్‌ చేస్తున్నారు.. కానీ, మేయర్‌కు చేయకపోవడం ఏంటి?దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ ఘటనపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలి’’అని ఫిర్యాదులో పేర్కొన్నారు.

కాగా.. ఈ దీనిపై కేరళ పోలీసు ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ జనరల్‌ సెక్రటరీ సోషల్‌మీడియా వేదికగా స్పందిస్తూ.. ‘‘సెల్యూట్‌ చేయడమనేది ఒక ఆచారం. పోలీసులు దాన్ని ఎంతో విలువైనదిగా చూస్తారు. చట్టబద్ధంగా అర్హులైన వారికే సెల్యూట్‌ చేస్తాం’’అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రోటోకాల్‌ మ్యానువల్‌లో ఎవరికి, ఎప్పుడు సెల్యూట్‌ చేయాలో స్పష్టంగా రాసుందని వ్యాఖ్యానించారు. మరోవైపు మేయర్‌ వర్గీస్‌ ఫిర్యాదుపై స్పందించిన డీజీపీ.. ఈ ఘటనపై విచారణ జరపాలని త్రిస్సూర్‌ రేంజ్‌ డీఐజీకి ఆదేశాలు జారీ చేశారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని