Mask: ఇంట్లో ఉన్నా పెట్టుకోవాల్సిన సమయం! 
close

తాజా వార్తలు

Updated : 26/04/2021 18:49 IST

Mask: ఇంట్లో ఉన్నా పెట్టుకోవాల్సిన సమయం! 

దిల్లీ: కరోనా మహమ్మారి ఉప్పెనలా విరుచుకుపడుతుండటంతో కేంద్ర ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. ఇంట్లో ఉన్నా మాస్క్‌లు ధరించాల్సిన సమయమిదని తెలిపింది. సెకండ్‌ వేవ్‌లో వైరస్‌ శరవేగంగా వ్యాపిస్తున్న తరుణంలో ప్రతి ఒక్కరూ భౌతికదూరం కచ్చితంగా పాటించాలని సూచించింది. మాస్క్‌లు ధరించినప్పుడు వ్యక్తుల మధ్య కొవిడ్‌ వ్యాపించదని పేర్కొంది. ప్రజలు అనవసర భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. దేశంలో కరోనా వైరస్‌ పరిస్థితిపై నిర్వహించిన మీడియా సమావేశంలో అధికారులు మాట్లాడారు.

‘‘ఇంట్లో ఉన్నా మాస్క్‌ ధరించాల్సిన సమయం.. ఎవరినీ ఆహ్వానించకండి. అనవసరంగా బయట తిరగవద్దు’’ అని నీతి ఆయోగ్‌ సభ్యుడు (ఆరోగ్యం) వీకే పాల్‌ సూచించారు. కుటుంబంలో ఒకరికి కొవిడ్ పాజిటివ్‌ వస్తే ఆ వ్యక్తి ఇంట్లో మాస్క్‌ ధరించి ఉండాల్సిందేనన్నారు. లేదంటే ఇతర కుటుంబ సభ్యులకూ వైరస్‌ వ్యాపించవచ్చని  హెచ్చరించారు. ఇంట్లో మాస్క్‌ పెట్టుకోవాల్సిన సమయం వచ్చిందని ఆయన తెలిపారు. లక్షణాలు ఉన్నవారు కొవిడ్‌ రిపోర్టులు వచ్చేదాకా వేచి చూడొద్దని.. వెంటనే ఐసోలేట్‌ కావాలని దిల్లీ ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా సూచించారు. లక్షణాలు ఉన్నప్పటికీ ఆర్‌టీ పీసీఆర్‌లో కూడా నెగెటివ్‌ వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. మాస్క్‌ పెట్టుకోకపోతే రిస్క్‌ ఎక్కువగా ఉంటుందని కేంద్ర ఆరోగ్యశాఖ అదనపు కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ తెలిపారు. మహారాష్ట్ర, యూపీ, కర్ణాటక, కేరళ, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, గుజరాత్‌, తమిళనాడు రాష్ట్రాల్లో ఒక్కోచోట లక్షకు పైగా యాక్టివ్‌ కేసులు ఉన్నట్టు తెలిపారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని