38కి.మీలు సైకిల్‌ తొక్కి.. అసెంబ్లీకెళ్లిన మంత్రి

తాజా వార్తలు

Published : 07/07/2021 14:48 IST

38కి.మీలు సైకిల్‌ తొక్కి.. అసెంబ్లీకెళ్లిన మంత్రి

కోల్‌కతా: ఇంధన ధరలు నానాటికీ పెరుగుతుండటంతో పశ్చిమ బెంగాల్‌లో ఓ మంత్రి వినూత్న నిరసన చేపట్టారు. తమ ఇంటి నుంచి అసెంబ్లీకి 38 కిలోమీటర్లు సైకిల్‌పై వెళ్లారు. ఆయనకు మద్దతుగా కొందరు పార్టీ కార్యకర్తలు కూడా మంత్రితో కలిసి సైకిళ్లపై ర్యాలీగా వెళ్లారు. 

బెంగాల్‌లో ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాలకు సింగూర్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే, రాష్ట్ర కార్మిక మంత్రి బెచారాం మన్నా నేడు సైకిల్‌పై వచ్చారు. హూగ్లీలోని తన నివాసం నుంచి ఈ ఉదయం 8 గంటలకు సైకిల్‌పై బయల్దేరిన ఆయన మధ్యాహ్నం 12.30 గంటలకు అసెంబ్లీకి చేరుకున్నారు. ‘‘నరేంద్రమోదీ ప్రభుత్వ వైఫల్యానికి తాజా నిదర్శనమే.. దేశంలో ఇంధన ధరల పెరుగుదల. కోల్‌కతాలో పెట్రోల్‌ ధర సెంచరీ దాటింది. దీనికి నిరసనగానే మేం ఈ సైకిల్‌ ర్యాలీ చేపట్టాం’’ అని మంత్రి తెలిపారు. 

దేశంలో చమురు ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో లీటర్‌ పెట్రోల్‌ ధర సెంచరీ కొట్టగా.. తాజాగా దిల్లీ, కోల్‌కతాలోనూ రూ.100 దాటేసింది. వాణిజ్య రాజధాని ముంబయిలో ఏకంగా రూ.106పైనే ఉంది. అటు కొన్ని ప్రాంతాల్లో డీజిల్‌ కూడా రూ.100 మార్క్‌ను దాటింది. పెట్రోల్‌ ధరల పెంపునకు నిరసనగా ఈ నెల 10, 11వ తేదీల్లో బెంగాల్‌ వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ మంగళవారం ప్రకటించింది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని