Tokyo Olympics: టోక్యోలో రికార్డు కేసులు.. నిరాటంకంగా క్రీడలు..!

తాజా వార్తలు

Published : 01/08/2021 01:08 IST

Tokyo Olympics: టోక్యోలో రికార్డు కేసులు.. నిరాటంకంగా క్రీడలు..!

రాజధాని నగరంలో తొలిసారి 4వేలకు పైగా కరోనా కేసులు

టోక్యో: డెల్టా వేరియంట్ ప్రపంచాన్ని చుట్టుముట్టేసింది. ఒలింపిక్ నగరం టోక్యోలో రికార్డు స్థాయి కేసుల్ని నమోదు చేస్తోంది. తాజాగా 4,058 కొత్త కేసులు వెలుగుచూశాయి. జపాన్ రాజధానిలో నాలుగువేలకు పైగా కేసులు బయటపడటం ఇదే మొదటిసారి. అలాగే దేశంలో వరుసగా రెండోరోజు 10వేలకు పైగా కేసులు బయటపడ్డాయి. మరోపక్క క్రీడాగ్రామంలో 21 మందికి కరోనా సోకింది. అక్కడ జులై 1 నుంచి ఇప్పటివరకూ 241 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. కాగా, ఇప్పటికే టోక్యోలో ‘అత్యవసర పరిస్థితి’ ఉండగా.. జపాన్ ప్రభుత్వం మరో 4 నాలుగు ప్రాంతాలకు ఆంక్షలను విస్తరించింది.  

టోక్యో నగరాన్ని కరోనా వణికిస్తున్నప్పటికీ.. ఒలింపిక్ క్రీడలు నిరాటంకంగా సాగుతున్నాయి. 21 స్వర్ణాలతో సహా మొత్తం 45 పతకాలతో చైనా పతకాల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. జపాన్ రెండు, అమెరికా మూడో స్థానంలో ఉన్నాయి. భారత్‌ మాత్రం మిశ్రమ ఫలితాలు అందుకుంటూ ముందుకు సాగుతోంది. ప్రస్తుతం వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను రూపంలో ఒక రజత పతకం భారత్ సొంతమైంది. 

మలేషియా, థాయ్‌లాండ్‌లో ‘డెల్టా’ విజృంభణ..

మలేషియా, థాయ్‌లాండ్‌లో రికార్డు స్థాయిలో వైరస్ కేసులు వెలుగుచూస్తున్నాయి. మలేషియాలో 17,786 మందికి కరోనా సోకగా..థాయ్‌లాండ్‌లో 18,912 మందికి పాజిటివ్‌గా తేలింది. నలుపు జెండాలు, ప్లకార్డులు ప్రదర్శిస్తూ మలేషియన్లు ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తిచూపుతున్నారు. కొద్దినెలలుగా విఫల ప్రభుత్వం పేరిట హ్యాష్ ట్యాగ్‌ అక్కడ ట్రెండ్ అవుతోంది. థాయ్‌లాండ్‌లో 60 శాతం కేసులకు డెల్టా వేరియంటే కారణమని అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. అమెరికా, చైనాలో కూడా ఈ వేరియంట్ ఉగ్రరూపం చూపిస్తోంది. ఈ వేరియంట్ వ్యాప్తిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది.  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని