ఆందోళనలు విరమించి చర్చలకు రండి: తోమర్‌

తాజా వార్తలు

Published : 27/06/2021 01:11 IST

ఆందోళనలు విరమించి చర్చలకు రండి: తోమర్‌

దిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తున్న రైతులు తమ ఆందోళనలను విరమించి చర్చలకు రావాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ విజ్ఞప్తి చేశారు. రైతుల ఆందోళన ఏడు నెలలు పూర్తి చేసుకుని ఎనిమిదో నెలలోకి అడుగుపెట్టిన నేపథ్యంలో మంత్రి ఈ విధంగా స్పందించారు. రైతులు వెంటనే ఆందోళనలు విరమించి.. చర్చలకు రావాలని మీడియా ద్వారా కోరారు. నూతన చట్టాలకు దేశవ్యాప్తంగా చాలా మంది మద్దతు ఇస్తున్నారని, కొందరు మాత్రమే వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. చట్టాల్లో ఏ నిబంధనలపై అభ్యంతరాలున్నాయో చర్చల సమయంలో ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని సూచించారు.

నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ పంజాబ్‌, హరియాణా, యూపీకి చెందిన రైతులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై కేంద్రం- రైతు సంఘాల ప్రతినిధుల మధ్య 11 దఫాలుగా చర్చలు జరిగినా ఫలితం లేకపోయింది. మరోవైపు ఈ చట్టాలపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటూ అమలు నిర్ణయాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. దీనిపై ఓ కమిటీ ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఆ కమిటీ కూడా నివేదికను సమర్పించింది. ప్రస్తుతం రైతుల ఆందోళన యథాతథంగా కొనసాగుతోంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని