టూల్‌కిట్‌ కేసు: శంతనుకు అరెస్టు నుంచి రక్షణ

తాజా వార్తలు

Published : 25/02/2021 16:29 IST

టూల్‌కిట్‌ కేసు: శంతనుకు అరెస్టు నుంచి రక్షణ

ఉత్తర్వులిచ్చిన దిల్లీ కోర్టు

దిల్లీ: గ్రెటా థెన్‌బర్గ్‌ ‘టూల్‌కిట్‌’ కేసులో అనుమానితుడిగా ఉన్న శంతను ములుక్‌కు దిల్లీ కోర్టు మార్చి 9 వరకు అరెస్టు నుంచి రక్షణ కల్పించింది. ఈ మేరకు గురువారం అదనపు సెషన్స్‌ జడ్జి ధర్మేందర్‌ రాణా ఉత్తర్వులిచ్చారు. తదుపరి విచారణ జరిగే వరకు శంతనుపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోరాదని ఆయన తీర్పులో వెల్లడించారు. కాగా ఈ అంశంపై అదనపు వివరాలను సమర్పించాలని ఆయన పోలీసులను ఆదేశించారు. పూర్తి వివరాలను అందించేందుకు వారంరోజుల సమయం కావాలని అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ఇర్ఫాన్‌ అహ్మద్‌ కోర్టును కోరారు. టూల్‌కిట్‌ కేసులో దిశరవితో పాటు సహ నిందితులుగా ఉన్న శంతను, నికిత ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు.

స్వీడన్‌కు చెందిన పర్యావరణ కార్యకర్త గ్రెటా థెన్‌బర్గ్‌ షేర్‌ చేయడంతో ఈ టూల్‌కిట్‌ వెలుగులోకి వచ్చింది. రైతుల ఆందోళనకు మద్దతు తెలిపేందుకు ఉన్న వివిధ మార్గాలను సూచిస్తూ ఒక డాక్యుమెంట్‌ను తయారు చేసి గ్రెటా థెన్‌బర్గ్‌కు పంపారు. దీన్ని తయారు చేసిన వారిపై దిల్లీ పోలీసులు దేశద్రోహం సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దీనిలో ప్రధాన నిందితురాలిగా ఉన్న దిశారవిని ఫిబ్రవరి 13న బెంగళూరులోని ఆమె నివాసంలో దిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.అనంతరం న్యాయస్థానం ఆమెకు బెయిల్‌ మంజూరు చేసింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని