బంగ్లాదేశ్‌లో కొనసాగిన అల్లర్లు

తాజా వార్తలు

Updated : 29/03/2021 00:22 IST

బంగ్లాదేశ్‌లో కొనసాగిన అల్లర్లు

ఢాకా‌: భారత ప్రధాని మోదీ బంగ్లాదేశ్‌లో పర్యటించడంపై ఆ దేశంలో ఆదివారం కూడా అల్లర్లు కొనసాగాయి. హిఫాజత్‌ ఎ ఇస్లాం అనే ఇస్లామిస్ట్‌ గ్రూప్‌ పిలుపు మేరకు ఆదివారం ఎద్దఎత్తున పలు ప్రాంతాల్లో ఆందోళనకారులు వీధుల్లో నిరసన చేపట్టారు. హిందూ దేవాలయాలపై దాడికి దిగారు. బ్రహ్మన్‌బరియాలో ఓ రైలుకు, రెండు బస్సులకు నిప్పంటించారు. ఈ ఘటనలో 10 మంది గాయపడ్డారు. పలు ప్రభుత్వ భవనాలు, ఓ ప్రెస్‌క్లబ్‌కు సైతం నిప్పంటించారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపైకి రాళ్లు విసిరారు. దీంతో పోలీసులు అందోళనకారులపై భాష్పవాయువు, రబ్బరు బులెట్లును ప్రయోగించారు. 


భారత్‌లో ముస్లింలపై వివక్ష చూపుతున్నారని ఇస్లామిస్ట్‌ గ్రూప్‌ హిఫాజత్‌ ఎ ఇస్లాం ఆరోపించింది. దీంతో ఆందోళనకారులు శుక్రవారం నుంచి పలుచోట్ల దాడులకు దిగారు. శుక్రవారం నుంచి ఇప్పటివరకు 10 మంది ఆందోళనకారులు మృతి చెందారు. బంగ్లాదేశ్‌ విమోచన ఉద్యమం స్వర్ణోత్సవాల్లో పాల్గొనడానికి భారత ప్రధాని మోదీ రెండు రోజుల పాటు ఆ దేశంలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా బంగ్లాదేశ్‌కు ప్రధాని మోదీ 10.2 లక్షల డోసుల కరోనా టీకాలు బహుకరించారు.  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని