బైడెన్‌ రాకముందే ట్రంప్‌నకు వీడ్కోలు
close

తాజా వార్తలు

Published : 18/01/2021 19:53 IST

బైడెన్‌ రాకముందే ట్రంప్‌నకు వీడ్కోలు

వాషింగ్టన్‌: అగ్రరాజ్య అధికార పీఠం నుంచి దిగుతున్న అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. కొత్త అధ్యక్షుడు బైడెన్‌కు ముఖాముఖి ఎదురుపడేందుకు ససేమిరా అంటున్నారు. అందుకే ఆయన ప్రమాణస్వీకారానికి కూడా హాజరుకావట్లేదు. కొత్త అధ్యక్షుడు బాధ్యతలు చేపట్టక ముందే వాషింగ్టన్‌ను వీడుతున్నారు. దీంతో బైడెన్‌ ప్రమాణస్వీకారం కంటే ముందే ట్రంప్‌నకు వీడ్కోలు పలికేందుకు వైట్‌హౌస్‌ అధికారులు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. 

బుధవారం ఉదయం 8 గంటలకు వాషింగ్టన్‌ డీసీ వెలుపల ఉన్న జాయింట్‌ బేస్‌ ఆండ్రూస్‌లో ట్రంప్‌ వీడ్కోలు కార్యక్రమం జరగనున్నట్లు తెలుస్తోంది. అటు నుంచి అటే ఆయన ఫ్లోరిడాకు వెళ్లిపోనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం సమయంలో బైడెన్‌ నూతన అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేస్తారు. ఈ కార్యక్రమానికి హాజరుకాబోనని ట్రంప్‌ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. అమెరికా చరిత్రలో గత శతాబ్ది కాలంలో అధికార మార్పిడికి దూరంగా ఉంటున్న తొలి అధ్యక్షుడు ట్రంప్‌ కావడం గమనార్హం.

ఇవీ చదవండి..

స్వీయ క్షమాభిక్షపై వెనక్కి తగ్గిన ట్రంప్‌!

పటిష్ఠ పహారాలో అమెరికా!


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని