న్యూస్‌ ఛానెల్‌లో అశ్లీల వీడియో ప్రసారం.. వీక్షకులు షాక్‌!

తాజా వార్తలు

Updated : 21/10/2021 18:09 IST

న్యూస్‌ ఛానెల్‌లో అశ్లీల వీడియో ప్రసారం.. వీక్షకులు షాక్‌!

వాషింగ్టన్‌: అమెరికాలోని వాషింగ్టన్‌ నగరం.. సాయంత్రం ఆరవుతోంది. ఓ స్థానిక వార్తా ఛానెల్‌లో ఇద్దరు యాంకర్లు నగర వాతావరణ సమాచారాన్ని విశ్లేషిస్తున్నారు.  కొద్ది సేపటికే  వీక్షకులు  ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు! కారణం.. ఆ ఛానెల్‌లో అనుకోకుండా అశ్లీల వీడియో ఒకటి ప్రసారం కావడమే. అమెరికాకు చెందిన టీవీ బ్రాడ్‌కాస్టింగ్‌ సంస్థ వార్తాసంస్థ ‘క్రెమ్‌ 2’లో సాయంత్రం ఆరు గంటల బులెటిన్‌లో 13 సెకన్లపాటు ఈ వీడియో ప్రసారమైంది. గత ఆదివారం ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఆ సమయంలో వాతావరణ నిపుణురాలు మిషెల్ బాస్ అప్‌డేట్ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె వెనుక ఉన్న తెరపై అశ్లీల వీడియో ప్రారంభమైంది. అయితే.. ఆమె గానీ, ఆమె సహ యాంకర్ గానీ ఈ విషయాన్ని గుర్తించలేదు. 
చివరకు తన తప్పును తెలుసుకున్న ఆ ఛానెల్.. రాత్రి 11 గంటల సమయంలో ఈ విషయమై క్షమాపణలు చెప్పింది. ఇలాంటివి మళ్లీ జరగకుండా జాగ్రత్త వహిస్తామని పేర్కొంది. ‘క్రెమ్‌ 2’ మాతృ సంస్థ టీఈజీఎన్‌ఏ చీఫ్‌ కమ్యూనికేషన్‌ అధికారి అన్నే బెంట్లీ సైతం ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఇదిలా ఉండగా.. వీక్షకుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో స్థానిక పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని