Rahul Gandhi: రాహుల్‌ గాంధీ ఖాతా తాత్కాలికంగా లాక్  

తాజా వార్తలు

Updated : 08/08/2021 01:33 IST

Rahul Gandhi: రాహుల్‌ గాంధీ ఖాతా తాత్కాలికంగా లాక్  

దిల్లీ: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ట్విట్టర్‌ ఖాతా తాత్కాలికంగా సస్పెండ్‌ అయినట్లు ఆ పార్టీ చేసిన ఆరోపణలను సామాజిక మాధ్యమం ట్విటర్‌ శనివారం తోసిపుచ్చింది. అనంతరం కాంగ్రెస్‌ పార్టీ స్పందిస్తూ రాహుల్‌ గాంధీ ట్విటర్‌ ఖాతా తాత్కాలికంగా సస్పెండ్‌ కాలేదని, లాక్‌ అయిందని పేర్కొంది. అంతకుముందు ఇదే విషయంపై స్పందిస్తూ.. రాహుల్‌గాంధీ ట్విటర్ ఖాతాను తాత్కాలికంగా నిలిపివేసినట్లు, ఆయన ఖాతా పునరుద్ధరణ ప్రక్రియ కొనసాగుతున్నట్లు ట్విటర్‌ చేసిన ప్రకటనను కాంగ్రెస్‌ తన అధికారిక ట్విటర్‌ హ్యాండిల్‌ ద్వారా వెల్లడించింది. అప్పటివరకు ఆయన ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంటారని అందులో వివరించింది. దిల్లీలో జరిగిన తొమ్మిదేళ్ల బాలిక హత్యాచార ఘటనకు సంబంధించి ఆమె తల్లిదండ్రుల వివరాలను బహిరంగపరిచే విధంగా రాహుల్‌ షేర్‌ చేసిన ఫొటోను ట్విటర్ అంతకుముందు తొలగించింది. సంస్థ నిబంధనలను ఆ ట్వీట్‌ ద్వారా అతిక్రమించిన నేపథ్యంలో ట్విటర్‌ ఆయన ఖాతాను తాత్కాలికంగా నిలిపివేసిట్లు ప్రచారం జరుగుతోంది. అయితే తాము ఆయన ట్విటర్‌ ఖాతాను నిలిపియేయలేదని, తాత్కాలికంగా లాక్‌ అయిందని, ఆ ఖాతా తిరిగి యథావిధిగా కొనసాగుతుందని ఆ సంస్థ అధికార ప్రతినిధి స్పష్టం చేశారు.

 దిల్లీలో హత్యాచారం జరిగినట్టుగా అనుమానిస్తున్న తొమ్మిదేళ్ల బాలిక కుటుంబాన్ని రాహుల్‌ గాంధీ పరామర్శించారు. ఆ సమయంలో తీసిన ఫొటోను రాహుల్ తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేశారు. అయితే పోక్సో చట్టం నిబంధనలను అతిక్రమిస్తూ బాధిత కుటుంబం వివరాలను బహిరంగపరచడంపై జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. వెంటనే ఆ పోస్టును తొలగించాల్సిందిగా ట్విటర్‌ను ఆదేశించింది. 

 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని