ట్విటర్‌ గ్రీవెన్స్‌ అధికారి గుడ్‌బై

తాజా వార్తలు

Published : 27/06/2021 21:14 IST

ట్విటర్‌ గ్రీవెన్స్‌ అధికారి గుడ్‌బై

దిల్లీ: ట్విటర్‌ ఇండియా తాత్కాలిక రెసిడెంట్‌ గ్రీవెన్స్‌ అధికారి తన పదవికి గుడ్‌బై చెప్పారు. నూతన ఐటీ నిబంధనలకు అనుగుణంగా ఇటీవలే నియమితులైన ధర్మేంద్ర చాతుర్‌ ఆ పదవి నుంచి వైదొలిగారు. అందుకు గల కారణాలు తెలియరాలేదు. దీనిపై స్పందించేందుకు ట్విటర్‌ సైతం నిరాకరించింది. భారత ప్రభుత్వానికి, ట్విటర్‌కు మధ్య ఘర్షణపూరిత వాతావరణం నెలకొన్న వేళ ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.

50 లక్షల యూజర్లను కలిగిన సోషల్‌మీడియా కంపెనీలు భారత్‌కు చెందిన ముగ్గురు అధికారులను నియమించుకోవాలని, వారి వివరాలను పొందుపరచాలని నూతన ఐటీ నిబంధనలు చెబుతున్నాయి. ఆ మేరకు మిగిలిన సోషల్‌మీడియా కంపెనీలు గ్రీవెన్స్‌ అధికారులతో పాటు ఇతర అధికారులను నియమించుకున్నాయి. ట్విటర్‌ మాత్రం ఈ విషయంలో ఆలస్యం చేసింది. కేంద్ర ప్రభుత్వం చివరి నోటీసుకు స్పందిస్తూ చీఫ్‌ కాంప్లియన్స్‌ అధికారిని నియమిస్తామని, అదే సమయంలో చాతుర్‌ను తాత్కాలిక గ్రీవెన్స్‌ అధికారిగా నియమిస్తున్నట్లు ఇటీవల తెలిపింది. కొద్దిరోజులకే ఆయన వైదొలగడంతో గ్రీవెన్స్‌ అధికారి స్థానంలో ఆయన పేరును తొలగించింది. ప్రస్తుతం అమెరికా అడ్రస్‌, ఈ-మెయిల్‌ ఐడీతో కూడి మరొకరి పేరు చూపుతోంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని