శ్రీనగర్‌లో ఉగ్రదాడి.. ఇద్దరు జవాన్ల మృతి
close

తాజా వార్తలు

Published : 05/10/2020 16:10 IST

శ్రీనగర్‌లో ఉగ్రదాడి.. ఇద్దరు జవాన్ల మృతి

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి దారుణానికి ఒడిగట్టారు. శ్రీనగర్‌ సరిహద్దు ప్రాంతంలో సీఆర్పీఎఫ్‌ జవాన్లపై దాడికి తెగబడ్డారు. కాగా ఈ దాడిలో ఇద్దరు సీఆర్పీఎఫ్‌ జవాన్లు అమరులు కాగా.. మరో ముగ్గురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీనగర్‌ సరిహద్దులో సీఆర్పీఎఫ్‌కు చెందిన భద్రతా దళాలు జాతీయ రహదారిపై పహారా కాస్తున్నాయి.  ఈ క్రమంలో కొందరు ఉగ్రవాదులు భద్రత సిబ్బందిపై బహిరంగ కాల్పులకు తెగబడ్డారు. ఉగ్రవాదుల కోసం ఆ ప్రాంతంలో గాలింపు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. కాగా గత కొద్ది వారాల వ్యవధిలో ఇదే ప్రాంతంలో భద్రతా దళాలపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడటం ఇది మూడో సారి కావడం గమనార్హం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని