Corona: ఉత్తర్‌ప్రదేశ్‌లో కపా వేరియంట్.. 

తాజా వార్తలు

Updated : 10/07/2021 11:02 IST

Corona: ఉత్తర్‌ప్రదేశ్‌లో కపా వేరియంట్.. 

ఇద్దరికి సోకిన కరోనా కొత్తరకం

దిల్లీ: సరికొత్త మ్యుటేషన్లతో కరోనా విజృంభిస్తోంది. ఇప్పటికే డెల్టా ప్లస్‌ కలవరం పుట్టిస్తుంటే.. కొత్తగా కపా రకం వెలుగులోకి వచ్చింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని దేవ్‌రియా, గోరఖ్‌పూర్‌లో ఈ కొత్త స్ట్రెయిన్‌కు చెందిన రెండు కేసుల్ని గుర్తించారు. దీని బారినపడిన 66 ఏళ్ల వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.  

జూన్‌ 13న సేకరించిన నమూనాలకు జీనోమ్ సీక్వెన్సింగ్ నిర్వహించగా.. కపా స్ట్రెయిన్ బయటపడింది. దీనిపై బీఆర్‌డీ వైద్య కళాశాలకు చెందిన అమరేశ్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ..‘ఆ వ్యక్తికి మే 27న కరోనా పాజిటివ్‌గా తేలింది. జూన్‌ 12న వైద్య కళాశాలకు తీసుకురాగా.. 13న నమూనాలు స్వీకరించాం. అయితే చికిత్స తీసుకుంటూ మరుసటి రోజు ఆయన మరణించారు. కపా వేరియంట్‌ సోకిన ఇద్దరూ విదేశీ ప్రయాణాలు చేసినట్లు ఆధారాల్లేవు’ అని వెల్లడించారు.

లఖ్‌నవూలోని కింగ్ జార్జ్‌ ఆస్పత్రిలో 109 నమూనాలను పరీక్షించగా..107 డెల్టా కేసులు, 2 కపా కేసులు బయటపడ్డాయని అధికారులు వెల్లడించారు. దేశంలో రెండోసారి కరోనా విజృంభించిన సమయంలో డెల్టా వేరియంట్‌ తీవ్రంగా ప్రబలిందని నిపుణులు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇప్పుడది డెల్టాప్లస్‌గా రూపాంతరం చెందింది. ఇది చాలదన్నట్టు ఇప్పుడు కపా రకం బయటపడటం ఆందోళన కలిగిస్తోంది.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని