Vaccine: రెండు డోసులతో డెల్టా వేరియంట్‌కు చెక్‌
close

తాజా వార్తలు

Updated : 15/06/2021 14:51 IST

Vaccine: రెండు డోసులతో డెల్టా వేరియంట్‌కు చెక్‌

యూకే వైద్య నిపుణుల పరిశోధనలో వెల్లడి

లండన్‌: భారత్‌లో వెలుగుచూసిన డెల్టా వేరియంట్‌పై రెండు డోసుల ఫైజర్‌ టీకా సమర్థవంతంగా పనిచేస్తుందని పబ్లిక్‌ హెల్త్‌ ఇంగ్లండ్‌ వెల్లడించింది. ఫైజర్‌/బయోఎన్‌టెక్‌ టీకా రెండు డోసులను తీసుకున్నవారిలో 96 శాతం మందికి ఆస్పత్రిలో చేరే పరిస్థితి రావడం లేదని వారు తెలిపారు. అదే ఆక్స్‌ఫర్డ్‌/ఆస్ట్రాజెనెకా టీకా తీసుకున్నవారిలో 92 శాతం మంది పరిస్థితి మెరుగ్గా ఉందని తెలిపారు. ఇంగ్లండ్‌లో డెల్టా వేరియంట్‌ కారణంగా కేసుల్లో భారీ పెరుగుదల నమోదైన నేపథ్యంలో వైద్య నిపుణులు ఈ పరిశోధనను నిర్వహించారు.

ఇంగ్లండ్‌ ఇమ్యునైజేషన్‌ హెడ్‌ మేరీ రామ్సే మాట్లాడుతూ.. డెల్టా వేరియంట్‌ నుంచి రక్షణ పొందే మార్గాలపై దృష్టి సారించామన్నారు. మరోవైపు మరణాల స్థాయిని తగ్గించేందుకు పరిశోధనలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఇప్పటి వరకు యూకేలోని 57 శాతం మంది ప్రజలు టీకా రెండు డోసులను తీసుకున్నారు. ప్రజలంతా పూర్తిస్థాయిలో టీకాలు తీసుకోవడం ద్వారానే వైరస్‌ గొలుసును తెంచగలమని పోర్ట్స్‌మౌత్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్‌ సైమన్‌ కోల్‌స్టో అన్నారు. దేశవ్యాప్తంగా టీకా పంపిణీ పూర్తయ్యేందుకు మరికొన్ని వారాలు పడుతుందని ఆయన అంచనా వేశారు. గతేడాది డిసెంబరు నుంచి ఇంగ్లండ్‌లో ఫైజర్‌/బయోఎన్‌టెక్‌ టీకా పంపిణీ కొనసాగుతోంది. ఇంగ్లండ్‌లో గుర్తించిన కరోనా వైరస్‌ ఆల్ఫా స్ట్రెయిన్‌ కారణంగా జనవరి నుంచి ఆంక్షలు అమలులో ఉన్నాయి. మరోవైపు టీకా రెండు డోసులకు మధ్య సమయాన్ని 12 వారాల నుంచి 8 వారాలకు తగ్గిస్తూ తాజాగా యూకే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని