Corona: భారత్‌లోని అమెరికా పౌరులకు కీలక సూచన!
close

తాజా వార్తలు

Updated : 29/04/2021 13:08 IST

Corona: భారత్‌లోని అమెరికా పౌరులకు కీలక సూచన!

వాషింగ్టన్‌: భారత్‌లో ఉన్న యూఎస్‌ పౌరులకు ఆ దేశ ప్రభుత్వం కీలక సూచన చేసింది. కరోనా ఉద్ధృతి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో వీలైనంత తొందరగా భారత్‌ను వదిలేయడం సురక్షితమని పౌరులకు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు అమెరికా రాయబార కార్యాలయం బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. 

‘భారత్‌లో కొవిడ్‌ కేసులు రికార్డు స్థాయిలో విజృంభిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో టెస్టింగ్‌కు సంబంధించి మౌలిక సదుపాయాల కొరత ఉంది. ఆస్పత్రులు కొవిడ్‌, నాన్‌ కొవిడ్‌ రోగులతో నిండిపోయి ఆక్సిజన్‌, పడకల కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కొవిడ్‌ విజృంభణ దృష్ట్యా దేశంలో వైద్య సదుపాయాలు పరిమిత స్థాయిలో అందుబాటులో ఉన్నాయి. కాబట్టి యూఎస్ పౌరులు ఇరు దేశాల మధ్య నడుస్తున్న విమానాలను ఎంచుకోవడం ఉత్తమం’ అని అమెరికా‌ రాయబార కార్యాలయం సూచించింది.

ఇండియాలో కరోనా కేసుల ఉద్ధృతి ప్రమాదకర స్థాయిలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. గడిచిన 24 గంటల్లో 3.79లక్షలకు పైగా కేసులు నమోదు కాగా.. మహమ్మారి ధాటికి 3,645 మంది ప్రాణాలు కోల్పోయారు. 



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని