భారత్‌కు సంఘీభావం.. బుర్జ్‌ ఖలీఫాపై త్రివర్ణ పతాకం

తాజా వార్తలు

Updated : 27/04/2021 05:57 IST

భారత్‌కు సంఘీభావం.. బుర్జ్‌ ఖలీఫాపై త్రివర్ణ పతాకం

దిల్లీ: భారత్‌లో కరోనా వైరస్‌ ఉగ్రరూపం దాల్చిన వేళ.. యూఏఈ భారత్‌ పట్ల సంఘీభావం ప్రకటించింది. ప్రపంచంలోనే అతి ఎత్తయిన దుబాయిలోని బుర్జ్‌ ఖలీఫా భవనంపై లేజర్‌ లైట్లతో భారత త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శించింది. అంతేకాకుండా ఆ వెలుగుల్లో ‘స్టే స్ట్రాంగ్‌ ఇండియా’(భారత్‌ కరోనాపై ధైర్యంగా పోరాడాలి) అనే సందేశాన్ని జోడించింది. ఇందుకు సంబంధించిన వీడియోను దుబాయిలోని భారత రాయబార కార్యాలయం ట్విటర్‌ ద్వారా విడుదల చేసింది.

‘భారత్‌ కరోనా మహమ్మారితో పోరాడుతున్న వేళ మిత్ర దేశం యూఏఈ తన సహృదయాన్ని చాటుకుంది. ప్రపంచంలోనే అతి ఎత్తయిన బుర్జ్‌ ఖలీఫా భవనంపై లేజర్‌ లైట్లతో భారత త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శించి సంఘీభావం తెలిపింది. అంతేకాకుండా భారత్‌ కరోనాను ధైర్యంగా ఎదుర్కొనాలని ఆకాంక్షించింది’ అని రాయబార కార్యాలయం ట్వీట్లో పేర్కొంది. అబుదాబి నేషనల్‌ ఆయిల్‌ కంపెనీ ప్రధాన కార్యాలయంపైనా త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శించారు.

కరోనాపై జరుగుతున్న యుద్ధంలో భారత్‌ తప్పకుండా విజయం సాధిస్తుందన్న నమ్మకం తనకు ఉందని యూఏఈ విదేశీ వ్యవహారాల మంత్రి షేక్‌ అబ్దుల్లా బిన్‌ జాయెద్‌ అల్‌ వెల్లడించారు. యూఏఈ సంఘీభావంపై స్పందించిన భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతానికి ఈ చర్యలు ఉపయోగపడతాయని చెప్పారు. కాగా, భారత్‌లో గత కొద్ది రోజులు కరోనా వైరస్‌ రెండో దశ విజృంభిస్తున్న విషయం తెలిసిందే. గడిచిన 24 గంటల్లో 3.50లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. 2,812 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని