IND-DUBAI: దుబాయ్‌ ఫ్లైట్‌ రెడీ..!
close

తాజా వార్తలు

Updated : 22/06/2021 04:12 IST

IND-DUBAI: దుబాయ్‌ ఫ్లైట్‌ రెడీ..!

 రెండు నెలల అనంతరం అందుబాటులోకి సేవలు

 దుబాయ్‌: దేశంలో కరోనా కారణంగా ఏప్రిల్‌25 నుంచి దుబాయ్‌ - భారత్‌ మధ్య విమాన సేవలు నిలిచిపోయాయి. కాగా, వచ్చే వారం నుంచి ఇరు దేశాల మధ్య విమాన సర్వీసులు ప్రారంభం కానున్నట్లు ప్రముఖ విమానయాన సంస్థ ఎమిరేట్స్‌ వెల్లడించింది. ‘‘దక్షిణ ఆఫ్రికా, నైజీరియా, భారత్‌ దేశాలకు చెందిన ప్రయాణికులకు విమానసేవలు అందుబాటులోకి తీసుకొచ్చాం. ముఖ్యంగా భారత్‌ దేశ ప్రయాణికులు వారి రెసిడెన్స్‌ వీసాతో పాటు యూఏఈ ధ్రువీకరించిన రెండు డోసుల వ్యాక్సిన్‌ తీసుకుంటేనే ఎమిరేట్స్‌లో ప్రయాణించేందుకు అనుమతి లభిస్తుంది. అంతేకాకుండా ప్రయాణానికి బయలుదేరే ముందు ఆర్టీపీసీఆర్‌ టెస్ట్‌ నెగిటివ్‌ రిపోర్టు చూపించాల్సి ఉంటుంది’’ అని ఎమిరేట్స్‌ ఓ ప్రకటనలో పేర్కొంది. గతంలో ఇరు దేశాల మధ్య వారానికి సుమారు మూడు వందల సర్వీసులు అందుబాటులో ఉన్నట్లు ఆసంస్థ వెల్లడించింది. కాగా, రెండు నెలల విరామం తరువాత ఇరు దేశాల మధ్య విమాన సేవలు పునఃప్రారంభం అవుతున్నాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని