J&J: సింగిల్‌ డోసు టీకాకు బ్రిటన్‌ ఆమోదం 

తాజా వార్తలు

Published : 28/05/2021 22:41 IST

J&J: సింగిల్‌ డోసు టీకాకు బ్రిటన్‌ ఆమోదం 

అందుబాటులోకి నాలుగు టీకాలు

లండన్‌: కరోనా వైరస్‌ను నిరోధించడంలో జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ అభివృద్ధి చేసిన సింగిల్‌ డోసు టీకాకు బ్రిటన్‌ ఆమోదం తెలిపింది. వ్యాక్సిన్‌ వినియోగానికి నియంత్రణ సంస్థలు అనుమతి ఇచ్చినట్లు బ్రిటన్‌ ఆరోగ్యశాఖ వెల్లడించింది. వ్యాక్సిన్‌ పంపిణీలో ఇప్పటికే దూసుకెళ్తున్న బ్రిటన్‌ జాన్సన్‌ టీకా అందుబాటులోకి రావడం ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేస్తుందని అభిప్రాయపడింది. బ్రిటన్‌లో ఇప్పటివరకు నాలుగు వ్యాక్సిన్‌లు అనుమతి పొందగా.. సింగిల్‌ డోసు టీకా మాత్రం ఇదే మొదటిది.

కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగంగా కొనసాగుతున్న దేశాల్లో అమెరికాతో పాటు బ్రిటన్‌ కూడా ముందు వరుసలో నిలిచింది. ఇప్పటివరకు అక్కడ ఫైజర్‌, ఆస్ట్రాజెనెకాను విరివిగా వినియోగిస్తున్నారు. అమెరికాకు చెందిన మోడెర్నా వినియోగానికి అనుమతి ఉంది. ఇప్పటి వరకు 6 కోట్ల డోసులను బ్రిటన్‌ పంపిణీ చేసింది. ఇప్పటికే వ్యాక్సిన్ల వల్ల కొన్ని వేల మందిని ప్రాణాపాయం నుంచి రక్షించినట్లు బ్రిటన్‌ ఆరోగ్యశాఖ మంత్రి మ్యాట్‌ హ్యాన్‌కాక్‌ పేర్కొన్నారు. కరోనా పోరులో భాగంగా రాబోయే కొన్ని నెలల్లో సింగిల్‌ డోస్‌ టీకా కీలక పాత్ర పోషిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇక అమెరికాలో జరిగిన ప్రయోగాల ప్రకారం, కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ సింగిల్‌ డోసు టీకా 72శాతం సామర్థ్యం కలిగి ఉన్నట్లు వెల్లడైంది. వీటి ఫలితాలను సమీక్షించిన బ్రిటన్‌ జే&జే వినియోగానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ముందస్తుగా దాదాపు 2కోట్ల సింగిల్‌ డోసు టీకాలను సమకూర్చుకునేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని