90కి చేరిన యూకే రకం కేసులు
close

తాజా వార్తలు

Published : 09/01/2021 14:46 IST

90కి చేరిన యూకే రకం కేసులు

దిల్లీ: దేశవ్యాప్తంగా యూకే రకం కరోనా వైరస్ కేసుల్లో రోజురోజుకూ పెరుగుదల కనిపిస్తోంది. శనివారం నాటికి కొత్త రకం వైరస్ కేసుల సంఖ్య 90కి చేరిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీని బారిన పడిన వారందరిని ఐసోలేషన్‌లో ఉంచినట్లు తెలిపింది. అలాగే వారి తోటి ప్రయాణికులు, కుటుంబ సభ్యులను గుర్తిస్తున్నట్లు పేర్కొంది. 

బ్రిటన్‌లో ఉత్పరివర్తన చెందిన ఈ వైరస్..అక్కడ వేగంగా వ్యాపిస్తోంది. రోజురోజుకూ అక్కడ కొత్త కేసులు, మరణాలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. అమెరికా, డెన్మార్క్‌, నెదర్లాండ్స్‌, ఆస్ట్రేలియా, జర్మనీ, జపాన్‌, సింగపూర్ వంటి దేశాల్లోనూ ఈ కొత్త రకం వైరస్ కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు, భారత్‌-యూకే మధ్య నడిచే విమాన సర్వీసులపై విధించిన తాత్కాలిక నిషేధాన్ని భారత ప్రభుత్వం ఎత్తివేసింది. దాంతో బ్రిటన్‌ నుంచి వచ్చే ప్రయాణికులకు ఎయిర్‌పోర్టులోనే ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. విదేశీ ప్రయాణికులు తప్పనిసరిగా 14 రోజులు క్వారంటైన్‌లో ఉండాలని అధికారులు సూచించారు. శుక్రవారం దిల్లీ ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి ఆదేశాలను జారీచేసింది. తమ ప్రజలను రక్షించుకునేందుకు యూకే నుంచి వస్తోన్న ప్రయాణికుల విషయంలో నిబంధనలు కఠినతరం చేస్తున్నామని స్పష్టం చేసింది.

ఇవీ చదవండి:

ఇప్పుడు యూఎస్ రకం కరోనా..!

మన టీకాల కోసం ప్రపంచం ఎదురుచూస్తోంది


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని