Delhi corona cases: కోలుకుంటున్న దిల్లీ

తాజా వార్తలు

Updated : 17/05/2021 20:29 IST

Delhi corona cases: కోలుకుంటున్న దిల్లీ

దిల్లీ: దేశ రాజధాని దిల్లీ క్రమంగా కోలుకుంటోంది. ఏప్రిల్‌ 5 తర్వాత అంటే 42 రోజుల తర్వాత తొలిసారిగా ఐదువేలకు తక్కువగా కేసులు నమోదయ్యాయి. తాజాగా 4,524 మంది కరోనా బారిన పడినట్లు ప్రభుత్వం హెల్త్‌ బులెటిన్‌లో వెల్లడించింది. పాజిటివిటీ రేటు సైతం 8.42 శాతానికి తగ్గినట్లు పేర్కొంది. గడచిన 24 గంటల్లో 340 మంది మరణించారని తెలిపింది. 10,918 మంది కరోనా నుంచి కోలుకున్నారని, ప్రస్తుతం 56,049 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని పేర్కొంది. 35,141 మంది హోంఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నారని ప్రభుత్వం తెలిపింది. ఇప్పటి వరకు దిల్లీలో 13,98,391 మంది కరోనా బారిన పడగా.. 21,846 మంది మృత్యువాతపడ్డారు.

దిల్లీలో కొద్ది రోజులుగా పరిస్థితులు మెరుగుపడుతూ వస్తున్నాయి. కేసుల సంఖ్యతో పాటు పాజిటివిటీ రేటు సైతం తగ్గుముఖం పడుతోంది. గత సోమవారం 12వేలకు పైగా కేసులు రాగా.. పాజిటివిటీ రేటు దాదాపు 20 శాతంగా ఉంది. వారం వ్యవధిలోనే ఈ రెండూ దాదాపు సగానికి పైగా తగ్గడం గమనార్హం. లాక్‌డౌన్‌ విధించడం వల్లే కేసులు తగ్గుముఖం పట్టినట్లు వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. అయితే కేసులు తగ్గినంత మాత్రన ఆంక్షలు సడలిస్తే ప్రమాదం ముంచుకొచ్చే అవకాశం ఉందని, అందుకే మే 24 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆదివారం ప్రకటించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని