యూపీలో పరిస్థితిపై కేంద్రమంత్రి ఆందోళన!
close

తాజా వార్తలు

Published : 09/05/2021 21:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

యూపీలో పరిస్థితిపై కేంద్రమంత్రి ఆందోళన!

పలు సమస్యలు లేవనెత్తుతూ ఆదిత్యనాథ్‌కు గాంగ్వార్‌ లేఖ

దిల్లీ: ఉత్తర్‌ప్రదేశ్‌లో కరోనా ఉద్ధృతి నేపథ్యంలో నెలకొన్న వైద్యారోగ్య పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేస్తూ కేంద్ర మంత్రి సంతోష్‌ గాంగ్వార్‌ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌కు లేఖ రాశారు. వెంటనే రాష్ట్రంలోని ఆరోగ్య సంరక్షణ వ్యవస్థల్లో మౌలిక వసతుల్ని మెరుగుపరచాలని విజ్ఞప్తి చేశారు. యూపీలోని బరేలీ లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న గాంగ్వార్‌ ఇలా సొంత పార్టీకి చెందిన ముఖ్యమంత్రికి లేఖ రాయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

అధికారులు సరైన సమయంలో స్పందించడం లేదని.. దీంతో ప్రజలు రిఫరల్‌ లెటర్లు చేతబట్టుకొని ఆసుపత్రుల చుట్టూ చక్కర్లు కొట్టాల్సిన పరిస్థితి తలెత్తిందని గాంగ్వార్‌ తన లేఖలో ఫిర్యాదు చేశారు. అలాగే తన నియోజకవర్గం బరేలీలో ఆక్సిజన్‌ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని కోరారు. వెంటిలేటర్లు సహా ఇతర వైద్య సామగ్రిని బ్లాక్ మార్కెట్‌లో అధిక ధరకు విక్రయిస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో వీటి ధరలపై రాష్ట్ర ప్రభుత్వం పరిమితి విధించాలని కోరారు. అలాగే ఎంఎస్‌ఎంఈ కింద రిజిస్టరయిన ప్రైవేటు ఆస్పత్రులకు రాయితీలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని