యూపీలో రేపటి నుంచి లాక్‌డౌన్ సడలింపులు

తాజా వార్తలు

Updated : 08/06/2021 16:47 IST

యూపీలో రేపటి నుంచి లాక్‌డౌన్ సడలింపులు

        * రాత్రి 7గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ అమలు

లఖ్‌నవూ: కొవిడ్‌ కట్టడి నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌కు సడలింపులు ఇస్తున్నట్లు మంగళవారం ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించింది.  ఉత్తర్‌ప్రదేశ్‌లోని 75 జిల్లాల్లో కొవిడ్‌ యాక్టివ్‌ కేసులు అన్నీ 600 కంటే తక్కువ ఉండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ‘‘ బుధవారం నుంచి అన్ని జిల్లాల్లో లాక్‌డౌన్‌ మినహాయింపులు ఇవ్వనున్నాం. కేవలం రాత్రి కర్ఫ్యూ.. రాత్రి 7గంటల నుంచి ఉదయం 7 గంటల వరకూ ఉంటుంది. వారాంతరాల్లో మాత్రం రోజంతా లాక్‌డౌన్‌ ఉండనుంది. ప్రతీ జిల్లాలో యాక్టివ్‌ కేసులు 600 కంటే తక్కువ ఉండటంతో పాటు ఇన్ఫెక్షన్‌ రేటు సైతం తగ్గుముఖం పట్టడంతో సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు.’’ అని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని