Corona Vaccination Stats: కరోనా టీకా పంపిణీలో టాప్‌ 10 రాష్ట్రాలివే..

తాజా వార్తలు

Updated : 31/08/2021 18:13 IST

Corona Vaccination Stats: కరోనా టీకా పంపిణీలో టాప్‌ 10 రాష్ట్రాలివే..

దిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి మూడో దశ ముప్పు పొంచి ఉన్న వేళ రాష్ట్రాలన్నీ వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేస్తున్నాయి. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో 100శాతం పెద్దలకు కనీసం ఒక డోసు టీకా పంపిణీ పూర్తయ్యింది. ఇక రాష్ట్రాల వారీగా చూసుకుంటే.. అత్యంత ఎక్కువ డోసులు పంపిణీ చేసిన రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్‌ తొలి స్థానంలో నిలిచింది. అయితే అత్యధిక మందికి రెండు డోసులు అందించిన రాష్ట్రంగా మహారాష్ట్ర మొదటిస్థానంలో ఉంది. 

మంగళవారం ఉదయం నాటికి దేశవ్యాప్తంగా 64.05కోట్ల టీకా డోసులు పంపిణీ అయ్యాయి. ఇప్పటివరకు 14.58కోట్ల మంది రెండు డోసులు తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలు పేర్కొన్నాయి. అత్యధికంగా యూపీలో 7.15కోట్ల డోసులను పంపిణీ చేయగా.. మహారాష్ట్రలో 5.82కోట్లు, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌లో 4.55కోట్ల డోసులను అందించారు. మహారాష్ట్రలో 1.57కోట్ల మంది డోసులు తీసుకోగా.. ఉత్తరప్రదేశ్‌లో 1.14కోట్ల మందికి టీకా పూర్తయ్యింది. గుజరాత్(1.13కోట్లు)‌, పశ్చిమ బెంగాల్‌(1.12కోట్లు), రాజస్థాన్‌(1.06కోట్లు), కర్ణాటక(కోటి) రాష్ట్రాల్లోనూ కోటి మందికి పైగా రెండు డోసుల టీకా తీసుకున్నారు. 

డోసుల పంపిణీలో టాప్‌ 10 రాష్ట్రాలు..

💉 ఉత్తరప్రదేశ్‌ - 7.15 కోట్లు

💉 మహారాష్ట్ర - 5.82 కోట్లు

💉 మధ్యప్రదేశ్‌ - 4.55 కోట్లు 

💉 గుజరాత్‌ - 4.55 కోట్లు

💉 రాజస్థాన్‌ - 4.39 కోట్లు

💉 కర్ణాటక - 4.17 కోట్లు

💉 పశ్చిమబెంగాల్‌ - 3.98 కోట్లు

💉 బిహార్‌ - 3.55 కోట్లు

💉 తమిళనాడు - 3.21 కోట్లు

💉 ఆంధ్రప్రదేశ్‌ - 2.93 కోట్లు



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని