భారత్‌కు సాయం.. కదిలిన అమెరికా యంత్రాంగం

తాజా వార్తలు

Published : 26/04/2021 13:16 IST

భారత్‌కు సాయం.. కదిలిన అమెరికా యంత్రాంగం

వాషింగ్టన్‌: కరోనా మహమ్మారి ఉద్ధృతితో భారత్‌ సతమతమవుతున్న వేళ దేశానికి సాయమందించేందుకు అమెరికా యంత్రాంగం పలు చర్యలు చేపడుతోంది. భారత్‌లోని ఆరోగ్య సిబ్బందికి అవసరమైన మేర సాయమందించాలని అమెరికా రక్షణ శాఖ మంత్రి ఆస్టిన్‌ లాయిడ్‌ పెంటగాన్‌కు సూచించారు. కొవిడ్‌ను ఎదుర్కోవడంలో భారత్‌కు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలంటూ అమెరికా అధ్యక్షుడు బైడెన్‌, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ ఆదేశించిన వేళ ఈమేరకు పెంటగాన్‌కు ఆస్టిన్‌ లాయిడ్‌ సూచించారు.

ప్రస్తుతం కష్టకాలంలో ఉన్న భాగస్వామ్య దేశమైన భారతీయుల పక్షాన అమెరికా రక్షణ శాఖలోని ప్రతిఒక్కరు అండగా నిలవాలని ఆస్టిన్‌ కోరారు. ఆక్సిజన్‌ సంబంధిత పరికరాలు, ర్యాపిడ్‌ టెస్టు కిట్లు, పీపీఈ కిట్లు తదితరాలు భారత్‌కు త్వరితగతిన పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆస్టిన్‌ వెల్లడించారు. కరోనాపై పోరులో భారత్‌కు సహకరించేందుకు అమెరికాలోని వివిధ శాఖలతోపాటు పారిశ్రామిక రంగం నుంచి సహకారం కోరుతున్నట్లు ఆయన వివరించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని