Mercy Ship: భారత్‌కు మెర్సీషిప్‌: షీలా జాక్సన్‌
close

తాజా వార్తలు

Published : 06/05/2021 12:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Mercy Ship: భారత్‌కు మెర్సీషిప్‌: షీలా జాక్సన్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: కొవిడ్‌ సంక్షోభంలో భారత్‌లో వైద్యసహాయం అందించేందుకు అమెరికా ఓ మెర్సీ షిప్‌ను పంపించే అవకాశం ఉంది. ఈ విషయాన్ని అమెరికా చట్ట సభ సభ్యురాలు షీలా జాక్సన్‌ లీ ట్విటర్‌లో పేర్కొన్నారు. ‘‘భారత్‌ మానవత సాయం ప్రకటించాము. ఓ మెర్సీషిప్‌ను భారత్‌కు పంపించాలని ప్రతిపాదించాము. భారత్‌లో పరిస్థితులు దయనీయంగా ఉన్నాయి. భారత్‌కు అన్ని విధాలా సాయం చేసేందుకు మేము కలిసి పనిచేస్తాము’’ అని ఆమె ట్వీట్‌ చేశారు.  షీలా జాక్సన్‌ బుధవారం హూస్టన్‌లోని ‘ది యునైటెడ్‌ మెమోరియల్‌ మెడికల్‌ సెంటర్‌’ నుంచి భారత్‌కు అవసరమైన సహాయ పరికరాలు పంపే కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.

అమెరికా కాంగ్రెస్‌ వుమెన్‌ కేథరిన్‌ క్లార్క్‌ మాట్లాడుతూ ‘‘భారత్‌లో సంక్షోభాన్ని నివారించేందుకు అమెరికా సాధ్యమైనంత వరకు కృషి చేయాలి. అంతేకాదు, ప్రపంచ వ్యాప్తంగా ఈ ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్‌ బారినపడి ప్రజలు  ప్రాణాలు కోల్పోకుండా పనిచేయాలి’’ అని తెలిపారు.

ఇండో-అమెరికన్‌ కాంగ్రెస్‌మెన్‌ రాజా కృష్ణమూర్తి  బుధవారం అమెరికాలోని భారత రాయబారి తరణ్‌జీత్‌ సింగ్‌ సంధుతో భేటీ అయ్యారు. అనంతరం తరణ్‌జీత్‌ సింగ్‌ సంధు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు. ‘‘ఈ కష్టకాలంలో భారత్‌కు అండగా ఉన్న కాంగ్రెస్‌ సభ్యుడికి ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు.

ఇప్పటి వరకు నాలుగు విమానాల్లో..

ఇప్పటి వరకు నాలుగు విమానాల్లో భారత్‌ సాయం పంపినట్లు అమెరికా రక్షణ మంత్రి లాయిడ్‌ ఆస్టిన్‌ ట్వీట్‌ చేశారు. అమెరికా పంపిన వాటిల్లో 10లక్షల ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్లు, 545 ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు, 16లక్షల ఎన్‌95 మాస్క్‌లు, 457 ఆక్సిజన్‌ సిలిండర్లు, 440 రెగ్యూలేటర్లు, 220 పల్స్‌ ఆక్సిమీటర్లు, ఒక డెప్లాయిబుల్‌ ఆక్సిజన్‌ కాన్సంట్రేషన్‌ వ్యవస్థ ఉన్నాయి. 



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని