Covid: అప్పటివరకు అమెరికా సురక్షితం కాదు..
close

తాజా వార్తలు

Updated : 25/05/2021 14:04 IST

Covid: అప్పటివరకు అమెరికా సురక్షితం కాదు..

టీకాలు వేసినా..కరోనా కొత్త రకాలను కట్టడి చేయాల్సిందే..

వాషింగ్టన్‌: కరోనా టీకా కార్యక్రమంలో వేగం ప్రదర్శిస్తోన్న అమెరికా..ఇటీవల మాస్క్‌ల వాడకంపై సడలింపులు ప్రకటించి ప్రపంచాన్ని ఆశ్చర్యపర్చింది. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న కరోనా వైరస్ వేరియంట్లకు చెక్ పెడితేనే అమెరికా సురక్షితమని యూఎస్‌ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్(యూఎస్‌ఏఐడీ) హెచ్చరించింది. వాటిని కట్టడి చేయకపోతే పూర్తిస్థాయిలో టీకాలు అందినప్పటికీ..పూర్తి రక్షణ లభించదని స్పష్టం చేసింది.

‘దేశవ్యాప్తంగా ఎంతమందికి టీకాలు వేసినప్పటికీ.. ప్రపంచంలోని ఇతర దేశాల్లో వైరస్ వ్యాప్తి చెందుతూ, కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నంత కాలం అమెరికా పూర్తిగా సురక్షితం కాదని మేం గుర్తించాం’ అని యూఎస్‌ఏఐడీకి చెందిన జెరేమీ కొనిన్‌డిక్ వ్యాఖ్యానించారు. అలాగే దక్షిణాసియాలో కొత్త వేరియంట్ల వ్యాప్తి కలవరం పుట్టిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. వాటిని కట్టడి చేసే ప్రయత్నాలను వేగవంతం చేయాల్సిన ఆవశ్యకతను ప్రముఖంగా ప్రస్తావించారు. మరోవైపు, కరోనాతో ఉక్కిరిబిక్కిరి అవుతోన్న భారత్‌కు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ అందించిన అత్యవసర సాయం గురించి మాట్లాడారు.

ఇటీవల బైడెన్ మాట్లాడుతూ..తమ దేశంలో టీకా లక్ష్యాన్ని చేరుకున్నాక అమెరికా ఇతర దేశాలకు టీకాలు అందించే ఆయుధశాలగా మారుతుందని వ్యాఖ్యానించారు. అలాగే జూన్ చివరి నాటికి ఫైజర్, మోడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ టీకా నిల్వల నుంచి 20 మిలియన్ల అదనపు టీకాలను ప్రపంచానికి అందుబాటులోకి తెస్తామని తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని