కుదుటపడుతోన్న అగ్రరాజ్యం

తాజా వార్తలు

Updated : 09/03/2021 15:14 IST

కుదుటపడుతోన్న అగ్రరాజ్యం

 మూడున్నర నెలల తరవాత 1,000లోపు మరణాలు

వాషింగ్టన్: కరోనాతో వణికిపోయిన అగ్రదేశం అమెరికా..కాస్త ఊపిరిపీల్చుకుంటోంది. సుమారు మూడున్నర నెలల తరవాత ఆ దేశంలో మరణాల సంఖ్య 1,000 దిగువకు చేరిందని తాజాగా జాన్స్‌ హాప్‌కిన్స్ యూనివర్సిటీ వెల్లడించింది. అమెరికా కాలమానం ప్రకారం..గడిచిన 24 గంటల్లో 749 మంది మృత్యుఒడికి చేరుకున్నారు. నవంబర్ 29 నుంచి నిత్యం అక్కడ వేయిమందికి పైనే ప్రాణాలు వదులుతున్నారు. జనవరి 12న రికార్డు స్థాయిలో 4,473 మరణాలతో అమెరికా గడగడలాడింది.

తాజా గణాంకాల ప్రకారం అమెరికాలో కరోనా వైరస్ నెమ్మదిస్తోందని తెలుస్తోంది. క్రిస్మస్, థ్యాంక్స్ గివింగ్, నూతన సంవత్సరం వేడుకల నేపథ్యంలో అమెరికా ప్రజలు భారీగా గుమిగూడటం, ప్రయాణాలు చేయడంతో.. కొద్ది వారాల క్రితం అక్కడ కరోనా ఉద్ధృతి మరోసారి ఎక్కువైంది. ఈ క్రమంలో కొత్త అధ్యక్షుడు జో బైడెన్ వైరస్‌ను అడ్డుకట్టవేసే నియంత్రణ చర్యలపై ప్రధానంగా దృష్టి సారించారు. పాలన చేపట్టిన వందరోజుల్లోగా వంద మిలియన్ల మందికి టీకాలు వేయడమే లక్ష్యంగా అమెరికన్ రెస్క్యూ ప్లాన్ పేరిట 1.9 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక ప్రణాళికను ప్రకటించారు. కరోనా వైరస్ నియంత్రణ, ఆర్థిక వ్యవస్థ స్థిరత్వం కోసం ఆ మొత్తాన్ని వినియోగించనున్నారు. ఆ ప్రణాళికకు శనివారం సెనేట్ ఆమోదం తెలిపింది.

అగ్రదేశంలో డిసెంబర్‌లో కరోనా టీకా కార్యక్రమం ప్రారంభమైంది. ఇప్పుడది వేగం పుంజుకుంది. ఇప్పటివరకు 10 శాతం (31.5 మిలియన్లు) మంది టీకాలు తీసుకున్నారని అధికారులు వెల్లడించారు. వరల్డో మీటర్ గణాంకాల ప్రకారం..ఆ దేశంలో 2,97,44,652 మందికి కరోనా వైరస్ సోకగా..5,38,628 మంది మృత్యుఒడికి చేరుకున్నారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని