చైనా రాకెట్‌.. అమెరికా ట్రాకింగ్‌.. 

తాజా వార్తలు

Published : 05/05/2021 15:52 IST

చైనా రాకెట్‌.. అమెరికా ట్రాకింగ్‌.. 

వాషింగ్టన్‌ : ఇటీవలే చైనా ప్రయోగించిన లాంగ్‌ మార్చ్‌ 5బీ  రాకెట్‌ భూమిపై కూలే దిశగా ప్రమాదకరంగా ప్రయాణిస్తోంది. ఈ వారంతంలో భూవాతావరణంలోకి ప్రవేశించే ఈ రాకెట్‌ లొకేషన్‌ను ట్రాక్‌ చేస్తున్నామని అమెరికా రక్షణ శాఖ వెల్లడించింది. మే 8న ఇది భూవాతావరణంలోకి ప్రవేశిస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ రాకెట్‌ మార్గాన్ని అమెరికా స్పేస్‌ కమాండ్‌ నిశితంగా పరిశీలిస్తోంది.

‘అంతరిక్షంలో చైనీస్‌ లాంగ్‌మార్చ్‌ 5బీ ఉన్న లొకేషన్‌ గురించి అమెరికా స్పేస్‌ కమాండ్‌కు పూర్తి అవగాహన ఉంది. దాన్ని ట్రాక్‌ చేస్తున్నాం. అయితే భూవాతావరణంలో అది ఎక్కడ కచ్చితంగా ప్రవేశిస్తుందో ఇప్పుడే నిర్ధారించలేం. కొన్ని గంటల ముందే చెప్పగలం. అది ఈ నెల 8న భూవాతావరణంలోకి ప్రవేశించనుందని అంచనా వేస్తున్నాం’ అని పెంటగాన్‌ స్పేస్‌ కమాండ్‌ సెంటర్‌ ఓ ప్రకటనలో తెలిపింది. అప్పటి వరకూ ఆ రాకెట్‌ లొకేషన్‌కు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తామని వెల్లడించింది.

చైనా ఓ అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించేందుకు ప్రయోగాలను మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఏప్రిల్‌ 29న ఆ దేశానికి చెందిన లాంగ్‌మార్చ్‌5బీ రాకెట్‌ తియాన్హే స్పేస్‌ స్టేషన్‌ కోర్‌ మాడ్యూల్‌ను అంతరిక్షంలోని 300 కిలోమీటర్ల ఎత్తున కక్ష్యలోకి చేర్చింది. ఆ రాకెట్‌  శకలాలు పొరబాటున ఓ తాత్కాలిక కక్ష్యలోకి చేరాయి. అవి భూమిపై పడనున్నాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని