ఉత్తరాఖండ్‌ విషాదం: 28 శరీర అవయవాల వెలికితీత

తాజా వార్తలు

Published : 19/02/2021 15:49 IST

ఉత్తరాఖండ్‌ విషాదం: 28 శరీర అవయవాల వెలికితీత

దేహ్రాదూన్‌: ఉత్తరాఖండ్‌లో మెరుపు వరదలు సృష్టించిన బీభత్సంలో గల్లంతైనవారి ఆచుకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 61 మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో 28 శరీర అవయవాలను వెలికితీసిన సహాయ సిబ్బంది వారిని గుర్తించే పనిలో ఉన్నారు. విపత్తు సంభవించి రెండు వారాలు కావస్తుండటంతో తమ కుటుంబ సభ్యులు తిరిగొస్తారనే ఆశలను వదులుకుంటున్నాయి కార్మికుల కుటుంబాలు. మితగావారు బతికుండే అవకాశం లేదని అధికారులు సైతం అభిప్రాయపడుతున్నారు.

ఈనెల 7వ తేదీన ధౌలిగంగ ఉప్పొంగి తపోవన్‌ విద్యుత్కేంద్రం కొట్టుకుపోయింది. ఈ వరదల్లో మొత్తం 204 మంది గల్లంతయ్యారు. కాగా, విద్యుత్కేంద్రంలోని సొరంగంలో చిక్కుకున్నవారి కోసం 13 రోజులుగా సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. సొరంగంలోని నీటిని మోటార్లతో తోడేస్తున్నారు. పేరుకుపోయిన మట్టిని తొలగిస్తున్నారు. సహాయక చర్యలను చమోలీ జిల్లా మెజిస్ట్రేట్‌ స్వాతి బదోరియా పరిశీలిస్తున్నారు.
 Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని