ఉత్తరాఖండ్‌ వరదలు: దిల్లీకి ఎఫెక్ట్‌ ..

తాజా వార్తలు

Published : 16/02/2021 01:36 IST

ఉత్తరాఖండ్‌ వరదలు: దిల్లీకి ఎఫెక్ట్‌ ..

దిల్లీ: ఉత్తరాఖండ్‌ వరదలు 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న దిల్లీనీ ప్రభావితం చేస్తున్నాయి. వరదల వల్ల దేశ రాజధానిలోని వేల సంఖ్యలో నివాసితులకు నీటి సరఫరా నిలిచిపోయింది. హిమనీ నదంలో నుంచి భారీ మంచు పెళ్లలు విరిగి ధౌలిగంగా నదిలో పడటంతో  ఫిబ్రవరి 7న ఉత్తరాఖండ్‌లో వరదలు వచ్చిన విషయం తెలిసిందే. ఉత్తరాఖండ్‌లోని రిషిగంగా లోయ దిల్లీకి ఈశాన్య దిశలో 530 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయితే ఈ నది దేశ రాజధానికి కీలకమైన నీటి వనరు. వరదలు రావడంతో నీటిలో అధిక మొత్తంలో మట్టి, శిథిలాలు ఉన్నాయని అధికారులు అంటున్నారు. ఈ క్రమంలో దేశ రాజాధానిలో నీటి సరఫరా కొంతమేరకు నిలిచిపోయింది. పూర్తిస్థాయిలో నీటి సరఫరా అందించలేమని అధికారులు తెలిపారు.

మురికి నీటి కారణంగా నగరంలోని రెండు ప్రధాన నీటి శుద్ధి కేంద్రాలు పూర్తి సామర్థ్యంతో పనిచేయడం లేదు. నివాసితులు అవసరాల మేరకు నీటిని వాడాలని దిల్లీ నీటి బోర్డు వైస్‌ ఛైర్మన్‌ రాఘవ్‌ చాధా తెలిపారు. వరదల వల్ల లోయ గుండా విద్యుత్  సరఫరా ఆగిపోయింది.  రోడ్లు, వంతెనలు నాశనమయ్యాయి.  కాగా 60 శాతం యమునా, 34 శాతం గంగా నది నుంచి దిల్లీకి నీటి సరఫరా అవుతోంది. వేసవిలో దేశ రాజధానికి తీవ్ర నీటి కొరత ఏర్పడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.  కాగా ఈ వరదల వల్ల ఇప్పటికే 53 మంది మరణించారు. మరో 150 మంది ఆచూకీ తెలియలేదని అధికారులు వెల్లడించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని