close

తాజా వార్తలు

Published : 06/03/2021 14:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఉత్తరాఖండ్ జలవిలయం..కారణమేంటంటే?

దేహ్రాదూన్: ఉత్తరాఖండ్‌లో సంభవించిన జలవిలయం భారీ స్థాయిలో ప్రాణ, ఆస్తినష్టాన్ని తెచ్చిపెట్టింది. ధౌలీగంగా, రిషిగంగా, అలకనందా నదులు ఉప్పొంగడంతో సమీపంలోని ఇళ్లు, ఆనకట్టలు, విద్యుత్ కేంద్రాలు తుడిచి పెట్టుకుపోయాయి. ఈ ఘటనలో సుమారు 70 మంది మరణించగా..125 మంది జాడ ఇంకా దొరకలేదు. అయితే ఈ జల ప్రళయానికి భారీ కొండచరియలే కారణమని శాస్త్రవేత్తలు అన్నారు. ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మౌంటెయిన్ డెవలప్‌మెంట్‌(ఐసీఐఎమ్‌ఓడీ)కి చెందిన అధికారులు శాస్త్రీయంగా కనుగొన్న విషయాలను వెల్లడించారు. దీనికి సంబంధించిన నివేదికను ఓ వార్త సంస్థ తాజాగా ప్రచురించింది. 

‘మంచుతో కలగలిసిన 22 మిలియన్‌ క్యూబిక్ మీటర్ల రాతి చరియలు ఉత్తరాఖండ్ విలయానికి కారణమయ్యాయి. గతంలో ఈ తరహా ఘటనల ద్వారా పేరుకుపోయిన శిథిలాలు, మంచు నీటిని ముందుకు తోసి, ప్రవాహ ఉద్ధృతికి దోహదం చేశాయి’ అని ఐసీఐఎంఓడీ తన నివేదికలో పేర్కొంది. ఈ వరద ప్రవాహానికి ఆనకట్టలు కూడా ధ్వంసమయ్యాయి. ఛమోలీ జిల్లాలోని 13 గ్రామాల ప్రజల రాకపోకలకు వీలుగా నిర్మించిన బెయిలే బ్రిడ్జి కూడా నదీ వరదల్లో తుడిచిపెట్టుకుపోయింది. దాంతో ఆ గ్రామాల ప్రజలకు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. వెంటనే రంగంలోని దిగిన ప్రభుత్వం ఫిబ్రవరి 25న మరలా ఆ బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టింది. మార్చి 20కల్లా దాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే పెట్టుకున్న గడువు కంటే ముందే బోర్డర్స్‌ రోడ్ ఆర్గనైజేషన్(బీఆర్‌ఓ) ఆ పని ముగించింది. దాంతో ట్రయల్స్ ముగించుకొని బెయిలే బ్రిడ్జి శుక్రవారం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. 


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని