మంత్రిగారూ..మాస్కు మూతికి పెట్టుకోవాలండీ!

తాజా వార్తలు

Updated : 15/07/2021 19:06 IST

మంత్రిగారూ..మాస్కు మూతికి పెట్టుకోవాలండీ!

ఉత్తరాఖండ్‌: కరోనా మూడో దశ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్కు తప్పనిసరిగా ధరించాలంటూ ఆరోగ్య నిపుణులు పదే పదే చెబుతున్నారు.  కానీ, చాలా మంది ఆ మాటలను పెడచెవిన పెడుతున్నారు. సాధారణ ప్రజలైతే సరేసరి.. పదిమందికీ చెప్పాల్సిన మంత్రుల స్థాయిలో ఉన్న వ్యక్తులే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.  మాస్కులు పెట్టుకోకుండా సమావేశాలకు హాజరవుతున్నారు. ఓ మంత్రి అయితే మాస్కును ఏకంగా కాలి బొటనవేలికి తగిలించి మీటింగ్‌లో పాల్గొనడం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.

ఉత్తరాఖండ్‌లో భాజపాకు చెందిన ఐదుగురు నేతలు ఓ సమావేశం ఏర్పాటు చేశారు. అందులో ముగ్గురు మంత్రులు కూడా ఉన్నారు. ఏ ఒక్కరికీ మాస్కులు లేవు. మంత్రి యతీశ్వరానంద్‌ మాస్కును ఏకంగా కాలి బొటన వేలికి తగిలించి సమావేశంలో పాల్గొనడం చర్చనీయాంశమైంది.  ఈ ఫొటోను ఉత్తరాఖండ్‌ కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి గరిమా దాసౌని ట్విటర్‌లో పోస్టు చేశారు.‘‘ ఇదీ అధికార భాజపా మంత్రుల పరిస్థితి. వీరంతా మాస్కులు పెట్టుకోని వారిని శిక్షించమని చెబుతారు.’’ అంటూ విమర్శించారు. మాస్కు పెట్టుకోవడానికి ఏది సరైన చోటో ఉత్తరాఖండ్‌ మంత్రిని అడిగి తెలుసుకోండి అంటూ ఆప్‌నేత దీప్‌ ప్రకాశ్‌ పంత్‌ కామెంట్‌ చేశారు. దీనిపై ప్రస్తుతం విపక్షాల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని