భారత్‌కు టీకానే దీర్ఘకాలిక పరిష్కారం: ఫౌచీ

తాజా వార్తలు

Published : 10/05/2021 15:13 IST

భారత్‌కు టీకానే దీర్ఘకాలిక పరిష్కారం: ఫౌచీ

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రజలందరికీ టీకాలు ఇవ్వడమే భారత్‌లోని ప్రస్తుత కొవిడ్‌-19 విజృంభణకు దీర్ఘకాలిక పరిష్కారమని అమెరికాకు చెందిన ప్రముఖ అంటువ్యాధుల నిపుణులు ఆంటోనీ ఫౌచీ స్పష్టం చేశారు. ఆయన ఏబీసీ న్యూస్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. దేశీయంగా, ప్రపంచ వ్యాప్తంగా టీకాల ఉత్పత్తిని వేగవంతం చేయాలని ఆయన సూచించారు. ‘‘ ప్రజలకు టీకాలు ఇవ్వడంతోనే ప్రస్తుత సంక్షోభానికి ముగింపు లభిస్తుంది. భారత్‌ ప్రపంచంలోనే అత్యధిక వ్యాక్సిన్లను ఉత్పత్తి చేసే దేశం. వారు టీకాలకు అవసరమైన మెటీరియల్‌ను దేశీయంగా తయారు చేసుకోవడంతోపాటు బయట నుంచి కూడ పొందాలి. లేకపోతే వారి వద్దే భారీ కంపెనీలు ఉంటే వందల మిలియన్ల టీకాలను ఉత్పత్తి చేయాలి’’ అని పేర్కొన్నారు.

భారత్‌ తక్షణమే దృష్టి సారించాల్సిన అంశాలు కూడా ఉన్నయని ఫౌచీ స్పష్టం చేశారు. వైరస్‌ వ్యాప్తిని అరికట్టడం, లాక్‌డౌన్‌లు విధించడం వంటి అంశాలను ఆయన పునరుద్ఘాంటించారు. ‘‘టీకాలు వేయడం ఒక పరిష్కారం మాత్రమే. లాక్‌డౌన్‌ విధించడం కూడా చాలా అవసరం. ఈ విషయాన్ని గతంలో కూడా చెప్పాను. ఇప్పటికే భారత్‌లోని చాలా రాష్ట్రాలు ఈ పనిచేశాయి. మీరు వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవాలంటే మాత్రం ఇదే మార్గం’’ అని ఫౌచీ నొక్కి చెప్పారు. గత వారం పీటీఐకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో కూడా ఫౌచీ ఈ అంశాలను ప్రస్తావించారు.

చైనా గతేడాది చేసినట్లుగానే భారత్‌ కూడా త్వరితగతిన తాత్కాలిక ఆస్పత్రులను నిర్మించాలని ఫౌచీ సూచించారు. అప్పుడే ప్రస్తుతమున్న పడకల కొరతను అధిగమించవచ్చన్నారు. భారత్‌లో కరోనా బాధితులకు ఎదురవుతున్న ఆక్సిజన్‌ కొరతపైనా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని