Delta Variant: జాన్సన్‌ టీకాతో ‘డెల్టా’కు అడ్డుకట్ట!

తాజా వార్తలు

Updated : 02/07/2021 14:28 IST

Delta Variant: జాన్సన్‌ టీకాతో ‘డెల్టా’కు అడ్డుకట్ట!

వాషింగ్టన్‌: తాము అభివృద్ధి చేసిన సింగిల్‌ డోసు టీకా.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న కరోనా డెల్టా రకం వైరస్‌ను సమర్థంగా అడ్డుకుంటున్నట్లు జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ వెల్లడించింది. వైరస్‌ సంక్రమణ నుంచి విస్తృతమైన రక్షణ కల్పిస్తున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ టీకా వల్ల ఉత్పత్తయిన యాంటీబాడీలు డెల్టాతో పాటు ఇతర రకాలను సైతం తటస్థీకరిస్తున్నట్లు గుర్తించామని తెలిపింది. దాదాపు ఎనిమిది నెలల పాటు యాంటీబాడీలు ఉత్పత్తయినట్లు వెల్లడించింది.

తొలి డోసు తీసుకున్న 29 రోజుల్లోనే డెల్టా వేరియంట్‌ను నిర్వీర్యం చేసే యాంటీబాడీలు జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ టీకాతో ఉత్పత్తయినట్లు సంస్థ పేర్కొంది. సమయం గడుస్తున్న కొద్దీ వైరస్‌ను అడ్డుకునే సామర్థ్యం మరింత మెరుగైనట్లు వెల్లడించింది. అలాగే ఇప్పటికే తమ టీకా తీసుకున్నవారు ఏడాది తర్వాత బూస్టర్‌ డోసు తీసుకోవాలని సంస్థ అధికారులు సూచించారు. అయితే, అందుకోసం టీకా ఫార్ములాను మార్చాల్సిన అవసరమేమీ లేదని తెలిపారు. ఇప్పటి వరకు సింగిల్‌ డోసుగా ఉన్న టీకాను మరింత మెరుగైన ఫలితాల కోసం రెండు డోసుల్లో ఇవ్వడాన్ని కూడా పరీక్షిస్తున్నట్లు జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ వెల్లడించింది.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని