దేశవ్యాప్తంగా 3 కోట్ల మందికి ఉచిత టీకా!

తాజా వార్తలు

Updated : 02/01/2021 13:17 IST

దేశవ్యాప్తంగా 3 కోట్ల మందికి ఉచిత టీకా!

ప్రకటించిన కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌

దిల్లీ: దేశవ్యాప్తంగా తొలివిడతలో మూడు కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ ఉచితంగా అందజేస్తామని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ ప్రకటించారు. దిల్లీలో పలు ప్రదేశాల్లో వ్యాక్సిన్ డ్రైరన్ జరుగుతున్న తీరును స్వయంగా పరిశీలించిన ఆయన ఈ ప్రకటన చేశారు. ‘‘తొలివిడత వ్యాక్సినేషన్‌లో భాగంగా అత్యంత ప్రాధాన్యం కలిగిన కోటి మంది వైద్యారోగ్య సిబ్బందికి, రెండు కోట్ల ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు ఉచితంగా టీకా అందజేస్తాం. ప్రాధాన్య క్రమంలో ఉన్న తదుపరి 27 కోట్ల మందికి వ్యాక్సిన్‌ ఎలా అందించాలనే దానిపై ఓ నిర్ణయానికి రాబోతున్నాం’’ అని ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. కొవిషీల్డ్‌ టీకా అత్యవసర వినియోగానికి కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ నిపుణుల బృందం పచ్చజెండా ఊపిన తరుణంలో కేంద్ర మంత్రి
నుంచి ఈ ప్రకటన రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

మరోవైపు దేశవ్యాప్తంగా నేడు టీకా డ్రైరన్‌ జరుగుతున్న సందర్భంగా వ్యాక్సిన్‌పై అనేక వదంతులు వస్తున్నాయని.. వాటిని నమ్మొద్దని హర్షవర్ధన్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. టీకా సామర్థ్యం, భద్రత, రోగనిరోధకతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని స్పష్టం చేశారు. పోలియో టీకా ఇస్తున్న సమయంలోనూ ఇలాంటి వదంతులే పుట్టుకొచ్చాయని గుర్తుచేశారు. కానీ, వాటిని పక్కన పెట్టడం వల్లే నేడు భారత్‌ పోలియో రహిత దేశంగా మారిందన్నారు. 

కాగా, 116 జిల్లాల్లోని 259 ప్రదేశాల్లో వ్యాక్సినేషన్‌ మాక్‌ డ్రిల్‌ శనివారం ఉదయం ప్రారంభమైంది. టీకా పంపిణీ కోసం ఏర్పాటు చేసిన అన్ని వ్యవస్థల పనితీరును ఈ డ్రైరన్‌లో అధికారులు విస్తృతంగా పరిశీలిస్తున్నారు. నిజమైన టీకా ఇవ్వడం తప్ప వాస్తవ వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో పాటించే మొత్తం ప్రక్రియను ఈ సందర్భంగా పాటిస్తారు. డిసెంబరు 28, 29న దేశవ్యాప్తంగా నాలుగు రాష్ట్రాల్లో జరిగిన తొలివిడత డ్రైరన్‌లో తలెత్తిన లోపాల్ని సవరించి కొత్త మార్గదర్శకాల ప్రకారం తాజా డ్రైరన్‌ను నిర్వహిస్తున్నారు. 

కాగా.. దేశంలో టీకాను అతిత్వరలో అందుబాటులోకి తెచ్చేందుకు కీలక ముందడుగు పడిన విషయం తెలిసిందే. ఆక్స్‌ఫర్డ్‌, ఆస్ట్రాజెనెకా సౌజన్యంతో సీరం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా తయారుచేసిన కొవిషీల్డ్‌ టీకా అత్యవసర వినియోగానికి కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ నిపుణుల బృందం పచ్చజెండా ఊపింది. ఈ టీకాకు షరతులతో కూడిన అనుమతివ్వాలని భారత ఔషధ నియంత్ర సంస్థ(డీసీజీఐ)కు సిఫార్సు చేసింది.

ఇవీ చదవండి..
దేశవ్యాప్తంగా టీకా డ్రైరన్‌

70 లక్షల మందికి టీకాలివ్వడమే సవాల్‌Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని