ఏడాది చివరినాటికి మార్కెట్లోకి టీకా!

తాజా వార్తలు

Published : 17/02/2021 19:38 IST

ఏడాది చివరినాటికి మార్కెట్లోకి టీకా!

ఎయిమ్స్‌ డైరెక్టర్ రణదీప్‌ గులేరియా

దిల్లీ: కొవిడ్‌ టీకా భద్రమైనదేనని, మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుందని దిల్లీ ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణదీప్‌ గులేరియా అన్నారు. గత నెల కరోనా టీకా తీసుకున్న ఆయన.. నేడు రెండో డోసు వేయించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది చివరి నాటికి కొవిడ్‌ వ్యాక్సిన్లు ఓపెన్‌ మార్కెట్లో అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయని తెలిపారు. 

‘‘ప్రధానంగా వ్యాక్సిన్లు తీసుకోవాల్సిన వారందరికీ(ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు, 50ఏళ్లు పైబడిన వృద్ధులు) టీకాలు ఇవ్వడం పూర్తయితే, డిమాండ్‌కు సరిపడా వ్యాక్సిన్లు వచ్చినప్పుడు మాత్రమే టీకాలు ఓపెన్‌ మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. బహుశా.. ఏడాది చివరి నాటికి లేదా అంతకంటే ముందే అది జరగొచ్చు’’ అని గులేరియా విశ్వాసం వ్యక్తం చేశారు. దేశంలో టీకా పంపిణీ ప్రారంభించిన తొలి రోజే గులేరియా వ్యాక్సిన్‌ తీసుకున్నారు. ఆయనతో పాటు నీతి ఆయోగ్‌ సభ్యుడు డాక్టర్‌ వీకే పాల్‌ కూడా టీకా వేయించుకున్నారు. 

కరోనా వ్యాప్తిని నియంత్రించే వ్యాక్సిన్‌ పంపిణీ కార్యక్రమం దేశంలో నిరాటంకంగా, శరవేగంగా సాగుతోంది. బుధవారం ఉదయం నాటికి దేశవ్యాప్తంగా 89లక్షల మందికి పైగా టీకాలు తీసుకున్నారు. జనవరి 16న తొలి డోసు తీసుకున్నవారికి ఫిబ్రవరి 14 నుంచి రెండో డోసు వేస్తున్నారు. Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని