INSACOG: ​​​​​​ఆ ప్యానెల్‌ నుంచి వైదొలిగిన ప్రముఖ వైరాలజిస్ట్‌
close

తాజా వార్తలు

Updated : 18/05/2021 07:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

INSACOG: ​​​​​​ఆ ప్యానెల్‌ నుంచి వైదొలిగిన ప్రముఖ వైరాలజిస్ట్‌

దిల్లీ: కరోనాపై పోరులో భాగంగా కేంద్రం ఏర్పాటు చేసిన ప్యానెల్‌ నుంచి ప్రముఖ వైరాలజిస్ట్‌ షాహీద్‌ జమీల్‌ వైదొలిగారు. కరోనా వైరస్‌కు సంబంధించిన జినోమ్‌ సీక్వెన్సింగ్‌ కోసం ఏర్పాటు చేసిన కన్సార్టియం (INSACOG) ఛైర్మన్‌ పదవి నుంచి తప్పుకున్నారు. శుక్రవారం జరిగిన INSACOG సమావేశంలో తన నిర్ణయాన్ని ప్రకటించినట్లు పేరు చెప్పడానికి ఇష్టపడని ఇద్దరు అధికారులు వెల్లడించారు. అప్పటి నుంచి జమీల్‌ ఫోన్లకు గానీ, సందేశాలకు గానీ సమాధానం ఇవ్వడం లేదు. అయితే, ఆయన ఎందుకు వైదొలిగిందీ కారణం వెల్లడించలేదు.

ఇటీవల దేశంలో కరోనా పరిస్థితులపై రాయిటర్స్‌ వార్తా సంస్థ ఓ కథనం రాసింది. మార్చిలోనే  హెచ్చరించినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నది ఆ వార్త సారాంశం. దీనిపై జమీల్‌ మాట్లాడుతూ వాస్తవాల ఆధారంగా విధాన రూపకల్పన చేయడానికి ప్రభుత్వం సన్నద్ధంగా లేదని అందులో పేర్కొన్నారు. ‘‘విధాన రూపకల్పన విషయంలో సైన్స్‌ పరిగణనలోకి తీసుకోలేదని నేను భయపడుతున్నా. కానీ నా అధికార పరిధి నాకు గుర్తుంది. శాస్త్రవేత్తలుగా మేం ఆధారాలు మాత్రమే అందిస్తాం. విధాన రూపకల్పన అనేది ప్రభుత్వ విధి’’ అని జమీల్‌ రాయిటర్స్‌తో పేర్కొన్నారు. జమీల్‌ వైదొలిగిన నేపథ్యంలో పలువురు కాంగ్రెస్‌ నేతలు కేంద్రంపై మండిపడ్డారు. శాస్త్రవేత్తల హెచ్చరికలను మోదీ పట్టించుకోకపోవడం వల్లే నేడు దుస్థితి నెలకొందంటూ ఆ పార్టీ నేతలు జైరామ్‌ రమేశ్‌, దిగ్విజయ్‌ సింగ్‌, మనీశ్‌ తివారీ తదితరులు ట్విటర్‌ వేదికగా విమర్శలు గుప్పించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని